ప్రపంచంలోనే అతిపెద్ద ఆంజనేయ ఆలయంగా కొండగట్టు..: బిఆర్ఎస్ ఎమ్మెల్యే హామీ (వీడియో)

By Arun Kumar P  |  First Published Oct 12, 2023, 4:43 PM IST

ప్రపంచంలోనే అతిపెద్ద ఆంజనేయ స్వాామి ఆలయంగా కొండగట్టును తీర్చిదిద్దుతామని బిఆర్ఎస్ ఎమ్మెల్యే రవిశంకర్ హామీ ఇచ్చారు. 


కరీంనగర్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార జోరును పెంచింది అధికార బిఆర్ఎస్. అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ శ్రేణులను ముందునుండే సంసిద్దం చేస్తూ వస్తున్నారు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇలా ఇప్పటికే అభ్యర్థులను ఎంపికచేసి ఒకేసారి 115 మంది లిస్ట్ ను విడుదల చేసారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడటంతో బిఆర్ఎస్ టికెట్ దక్కిన నాయకులు ప్రజల్లోకి వెళుతూ ప్రచార జోరు పెంచారు. ఇలా మరోసారి బిఆర్ఎస్ టికెట్ పొందిన చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రచారం ప్రారంభించారు.    

కొడిమ్యాల మండలం తుర్కకాశినగర్ గ్రామంలో ఎమ్మెల్యే రవిశంకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలోనే తెలంగాణలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటయిన కొండగట్టు అంజనేయస్వామి ఆలయ అభివృద్దిపై కీలక ప్రకటన చేసారు. యావత్ ప్రపంచమే ఆశ్చర్యపోయేలా అతి పెద్ద హనుమాన్ దేవాలయం కొండగట్టులో రూపుదిద్దబోతుందని...అందుకు బిఆర్ఎస్ ప్రభుత్వం భారీ నిధులు ఖర్చుచేయనుందని ఎమ్మెల్యే తెలిపారు. కొండగట్టు దేవాలయ అభివృద్దికి కేసీఆర్ సర్కార్ కట్టుబడి వుందని ఎమ్మెల్యే స్పష్టం చేసారు. 

Latest Videos

వీడియో

ఇక చొప్పదండి ప్రజలు స్థానికేతరులను నమ్మి గతంలో గోస పడ్డారని... అందువల్లే మీ బిడ్డనైన తనను గత ఎన్నికల్లో గెలిపించుకున్నారని రవిశంకర్ పేర్కొన్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజా సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నానని తెలిపారు. ఎన్నికల ముందే నియోజవకర్గానికి వచ్చితర్వాత వెళ్లిపోయే నాయకులకు ఈ ప్రాంతం మీద మమకారం ఉండదన్నారు. అందరికీ నిత్యం అందుబాటులో వుండే తనను మరోసారి గెలిపించాలని రవిశంకర్ ప్రజలను కోరారు. 
 

click me!