వారితో నాకు ఎలాంటి సంబంధం లేదు.. ఐటీ రైడ్స్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే భాస్కర్‌రావు

By Sumanth KanukulaFirst Published Nov 16, 2023, 1:08 PM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీ  ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నల్లమోతు భాస్కర్‌రావు ఇంటిపై ఐటీ దాడుల వార్తలు కలకలం రేపుతున్నాయి.

తెలంగాణ అసెంబ్లీ  ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నల్లమోతు భాస్కర్‌రావు ఇంటిపై ఐటీ దాడుల వార్తలు కలకలం రేపుతున్నాయి. 40 బృందాలతో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. నల్లమోతు భాస్కర్‌రావు ముఖ్య అనుచరులు, బంధువుల ఇళ్లల్లోనూ ఐటీ రైడ్స్‌ కొనసాగుతున్నాయి. అయితే ఐటీ సోదాలపై స్పందించిన నల్లమోతు భాస్కర్‌రావు.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఐటీ అధికారులు ఎవరు తనను కలవలేదని చెప్పారు. రైస్ మిల్లులపైనే దాడులు జరుగుతున్నాయని అన్నారు. రైస్ మిల్లర్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. 

ఐటీ రైడ్స్‌ ఎదుర్కొంటున్న వాళ్లతో తనకు ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవని నల్లమోతు భాస్కర్‌రావు తెలిపారు. కుట్రలో భాగంగానే ప్రతిపక్షాలు తనపై ఆరోపణలు చేస్తున్నాయి. తనకు ఎలాంటి కంపెనీలు లేవని, డబ్బులు లేవని.. ఎక్కడైనా చూపిస్తే ఇచ్చేస్తానని తెలిపారు.  ఇక, నల్లమోతు భాస్కర్ రావు మిర్యాలగూడ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో కూడా మిర్యాలగూడ నుంచే బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు.

ఇక, ఇటీవల హైదరాబాద్‌లోని తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బంధువుల నివాసాలపై ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. గచ్చిబౌలిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న ప్రదీప్‌ నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. ప్రదీప్ మంత్రికి సమీప బంధువు. 

click me!