"మగాడివైతే ఆ పని చేసి చూపించాలి.." : సీఎం రేవంత్ రెడ్డిపై కడియం ఘాటు వ్యాఖ్యలు

By Rajesh Karampoori  |  First Published Mar 1, 2024, 5:22 AM IST

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)పై  మాజీ ఉప ముఖ్యమంత్రి,ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) హాట్ కామెంట్స్ చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలోని మొత్తం 17కి 17 ఎంపీ స్థానాలను గెలిపించి సీఎం రేవంత్ రెడ్డి మగతనం చూపించుకోవాలని సవాల్ విసిరారు. 


తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)పై  మాజీ ఉప ముఖ్యమంత్రి,ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) హాట్ కామెంట్స్ చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలోని మొత్తం 17కి 17 ఎంపీ స్థానాలను గెలిపించి సీఎం రేవంత్ రెడ్డి మగతనం చూపించుకోవాలని సవాల్ విసిరారు. గురువారం నాడు విలేకరుల సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ. కేటీఆర్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు   తీవ్రంగా ఖండించారు. హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని విమర్శించారు.  తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు.

వచ్చే ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు అయినా గెలవాలని బీఆర్‌ఎస్ పార్టీకి రేవంత్ రెడ్డి సవాల్ విసరడంపై కడియం శ్రీహరి ఘాటుగా స్పందించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ సాధించలేకపోయిందని, రేవంత్ మగాడివైతే ఎందుకు ఒక్క సీటు కూడా గెలిపించుకోలేక పోయాడని ప్రశ్నించారు. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ సీట్లు గెలిచి రేవంత్ రెడ్డి తన మగతనం నిరూపించుకోవాలని సవాల్ విసిరారు.
 
తనకు సీఎం కుర్చీ కానుకగానో, వారసత్వంగానో రాలేదని రేవంత్ రెడ్డి చెప్పడంపై శ్రీహరి కౌంటర్ ఇచ్చారు. కుటుంబ రాజకీయాలపై కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఆయన ప్రశ్నించారు. ఇందిరాగాంధీ వారసత్వంపై నిరంతరం ఆధారపడటంపై వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ కాదని, ప్రాంతీయ పార్టీ కంటే అధ్వాన్నంగా మారిందని అన్నారు. రేవంత్ రెడ్డి కేవలం కాంగ్రెస్ పార్టీ కోసం కాకుండా తెలంగాణ ప్రజల కోసం ముఖ్యమంత్రిగా వ్యవహరించాలని కోరారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని శ్రీహరి పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని, నిపుణుల కమిటీతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు.

Latest Videos

మరమ్మతులు చేయకుండానే మేడిగడ్డ పూర్తిగా పాడైపోయేలా చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరిత ఎజెండాగా వ్యవహరిస్తోందని ఆరోపించిన శ్రీహరి వెంటనే మరమ్మతులు చేపట్టి రైతులకు మేలు చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి  భాష , సంభాషణలో జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు. ఈ మీడియా సమావేశంలో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, వరంగల్ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఇతర బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

నిజంగా రేవంత్ రెడ్డి అంతా మగాడు అయితే అంత గోప్పవాడు అయితే ఆయన చెప్పినట్టుగా తెలంగాణలో ఉన్న 17 పార్లమెంట్ స్థానాలకు 17 గెలిపించి చూపించాలని. నీ బాషలోనే చెబుతున్నా.. అన్ని స్థానాలు గెలిచి నీ మగతనం చూపించుకోవాలని సవాల్ చేశారు. కాగా ఇటీవల చెవేళ్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందని, లోక్ సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదని విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గా బీఆర్ఎస్ నాయకులు ఈ తరహ వ్యాఖ్యలు చేస్తున్నారు.  

click me!