సర్పంచ్ లకు చెల్లించాల్సిన బిల్లులను బీఆర్ఎస్ పక్కదారి పట్టించింది - మంత్రి సీతక్క

By Sairam IndurFirst Published Jan 19, 2024, 1:11 PM IST
Highlights

సర్పంచ్ ల పెండింగ్ బిల్లుల (sarpanch pending bills in telangana) కు సంబంధించిన అంశంపై కేబినేట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క (minister seethakka)అన్నారు. గత ప్రభుత్వం (BRS Government) సర్పంచ్ లకు చెల్లించాల్సిన బిల్లులను పక్క దారి పట్టించిందని తెలిపారు.

సర్పంచ్ లకు చెల్లించాల్సిన బిల్లులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కదారి పట్టించిందని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. దీంతో ఐదేళ్లుగా వారికి చెల్లించాల్సిన బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. దీంతో సర్పంచ్ లు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. 

ఎస్‌సీ వర్గీకరణపై కీలక పరిణామం: ఐదుగురు సభ్యులతో కమిటీ వేసిన కేంద్రం

Latest Videos

ములుగు పంచాయతీ పాలకవర్గం సభ్యులు మంత్రి సీతక్కను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచ్ లకు చెల్లించాల్సిన రూ.1,200 కోట్లను దారి మళ్లించిందని విమర్శించారు. దీంతో చాలా మంది సర్పంచ్ లు అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెట్టారని తెలిపారు. ఈ విషయాన్ని గతంలో అసెంబ్లీలో ప్రస్తావిస్తే... అన్ని చెల్లింపులు జరిపామని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సమాధానం ఇచ్చిందని అన్నారు.

Ayodhya Ram Mandir : అంతా రామమయం ... సర్వాంగసుందరంగా ముస్తాబవుతున్న అయోధ్య

కానీ ఇప్పుడు రికార్డులు అన్నీ పరిశీలిస్తే చాలా బిల్లులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని తెలుస్తోందని మంత్రి సీతక్క అన్నారు. వాటిని ప్రభుత్వం ఎప్పుడు చెల్లిస్తుందా అని సర్పంచ్ లు ఇంకా ఎదురు చూస్తున్నారని అన్నారు. ఇంకా నెల రోజులు గడిస్తే వారి పదవీ కాలం కూడా ముగుస్తుందని తెలిపారు. అందుకే వారి సమస్యను కేబినేట్ మీటింగ్ లో చర్చిస్తామని, ఓ నిర్ణయం తీసుకుంటామని మంత్రి సీతక్క తెలిపారు. . 

click me!