లోటస్‌పాండ్‌లో అనిల్ పుట్టిన రోజు వేడుకలు: షర్మిల సమక్షంలో కేక్ కట్

Published : Feb 10, 2021, 12:13 PM ISTUpdated : Feb 10, 2021, 12:18 PM IST
లోటస్‌పాండ్‌లో అనిల్ పుట్టిన రోజు వేడుకలు: షర్మిల సమక్షంలో కేక్ కట్

సారాంశం

లోటస్‌పాండ్‌లో బ్రదర్ అనిల్ 51వ పుట్టినరోజు వేడుకలు బుధవారం నాడు జరిగాయి. అభిమానుల మధ్య బ్రదర్ అనిల్ కేక్ కట్  చేశారు.

హైదరాబాద్: లోటస్‌పాండ్‌లో బ్రదర్ అనిల్ 51వ పుట్టినరోజు వేడుకలు బుధవారం నాడు జరిగాయి. అభిమానుల మధ్య బ్రదర్ అనిల్ కేక్ కట్  చేశారు.బెంగుళూరు నుండి సోమవారం నాడు  షర్మిల దంపతులు హైద్రాబాద్‌కు చేరుకొన్నారు. వైఎస్ఆర్ అభిమానులతో లోటస్ పాండ్ లో షర్మిల సమావేశమయ్యారు. 

బ్రదర్ అనిల్ పుట్టిన రోజును పురస్కరించుకొని లోటస్‌పాండ్ లో కేక్ కట్ చేశారు. షర్మిలతో పాటు  పలువురు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. షర్మిల త్వరలోనే పార్టీని ఏర్పాటు చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. షర్మిల పార్టీ  వెనుక బ్రదర్ అనిల్ కీలకపాత్ర పోషించనున్నారు.

తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకువస్తానని షర్మిల ప్రకటించారు. ఇందులో భాగంగానే షర్మిల వైెఎస్ఆర్ అభిమానులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. తొలుత నల్గొండ జిల్లాకు చెందిన అభిమానులతో సమావేశం నిర్వహించారు. 

త్వరలోనే ఇతర జిల్లాలకు చెందిన వైఎస్ఆర్ అభిమానులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశాలు నిర్వహించిన తర్వాత పార్టీని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ మేరకు ఆమె అన్ని రకాల ఏర్పాట్లు చేసుకొంటున్నారు.

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం