పెళ్లికి వెళ్లి వస్తూ... ఇద్దరు అన్నా చెల్లెళ్లు మృతి..!

Published : Nov 20, 2021, 08:15 AM ISTUpdated : Nov 20, 2021, 08:24 AM IST
పెళ్లికి వెళ్లి వస్తూ... ఇద్దరు అన్నా చెల్లెళ్లు మృతి..!

సారాంశం

బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లారు. తిరిగి హైదరాబాద్ కు ద్విచక్ర వాహనంపై ప్రయాణమయ్యారు. మార్గ మధ్యలో తిమ్మాపూర్ జాతీయ రహదారిపై బంకులోకి వెళ్తున్న లారీని ఢీకొట్టారు


శుభకార్యానికి వెళ్లి వస్తూ.. ఇద్దరు అన్నా చెల్లెళ్లు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. పిల్లలిద్దరూ ఒకేసారి దుర్మరణం చెందడంతో.. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ సంఘటన కొత్తూరు పురపాలక పరిధి తిమ్మాపూర్ పెట్రోల్ బంక్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: తెలంగాణ: 24 గంటల్లో 137 మందికి కరోనా పాజిటివ్.. 6,74,318కి చేరిన కేసుల సంఖ్య

మూసాపేట్ మండలం  కొమ్మిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన జటారం చంద్రశేఖర్(25) తన చెల్లి మద్దూరి మమత(24) తో ఖిల్లాఘనపురంలో బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లారు. తిరిగి హైదరాబాద్ కు ద్విచక్ర వాహనంపై ప్రయాణమయ్యారు. మార్గ మధ్యలో తిమ్మాపూర్ జాతీయ రహదారిపై బంకులోకి వెళ్తున్న లారీని ఢీకొట్టారు. దీంతో.. ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Also Read: ఈ నెల 21న ‘హైదరాబాద్ యూత్ అసెంబ్లీ’.. ముఖ్య అతిథులుగా మంత్రి శ్రీనివాస్ గౌడ్, పుల్లెల గోపీచంద్

హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఫార్మా కంపెనీలోనే ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. మమతకు ఏడాది క్రితం నారాయణపేట జిల్లా మరికల్ మండలం పెద్దచింతకుంట గ్రామానికి చెందిన మద్దూరి అమరేందర్ రెడ్డితో వివాహమైంది. ప్రమాదం విషయం తెలుసుకొని ఘటనాస్థలానికి ఏఎస్సై అబ్దుల్లా చేరుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాలను షాద్ నగర్ ఆస్పత్రికి తరలించారు. చంద్రశేఖర్ వద్దనే తండ్రి తిమ్మారెడ్డి, తల్లి కల్లమ్మలు ఉంటున్నారు.
 

PREV
click me!

Recommended Stories

మీ కళ్లు చల్లబడ్డాయా?: Singer P Susheela emotional on Singer S Janaki's demise | Asianet News Telugu
July Holidays : ఈ వీక్ ఇంకో రెండ్రోజులే ఫుల్ వర్కింగ్ డేస్, నాల్రోజులు సెలవులే.. ఏరోజు, ఎందుకో తెలుసా?