నన్ను ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకుంటావా: బరాత్‌లో వధువు ప్రియుడి హల్‌చల్ (వీడియో)

Siva Kodati |  
Published : Aug 28, 2020, 03:57 PM ISTUpdated : Aug 28, 2020, 04:15 PM IST
నన్ను ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకుంటావా: బరాత్‌లో వధువు ప్రియుడి హల్‌చల్ (వీడియో)

సారాంశం

ఇంట్లో పెళ్లి జరిగి కుటుంబసభ్యులంతా ఆనందంగా వున్న వేళ పెళ్లి కూతురి లవర్‌ను అంటూ ఓ వ్యక్తి వివాహ వేడుక వద్ద నానా హంగామా సృష్టించాడు. అచ్చం సినిమా ఫక్కీలో జరిగిన ఈ సంఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో చోటు చేసుకుంది.

పట్టణానికి చెందిన దివ్యతో మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌కు చెందిన ఓ యువకుడితో వివాహం ఘనంగా జరిగింది. పెళ్లి చేసుకుని సాయంత్రం బరాత్ ఊరేగింపు జరుగుతున్న సమయంలో హుజురాబాద్‌కు చెందిన వంశీ అనే యువకుడు అతని స్నేహితులతో కలిసి వధువు వాహనాన్ని అడ్డుకున్నాడు.

దివ్య తనను ప్రేమించిందని, తనను ప్రేమించి వేరే వాడిని ఎలా పెళ్లి చేసుకున్నావని వాగ్వాదానికి దిగాడు. దీంతో ఒక్కసారిగా సందడిగా జరుగుతున్న కార్యక్రమంలో యువకుడి వాగ్వాదం వల్ల ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

కాగా దివ్య, వంశీల మధ్య గతంలో ప్రేమ వ్యవహారం నడిచిందని స్థానికులు చెబుతున్నారు. దీంతో చేసేదేమీ లేక పెళ్లి కొడుకు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఊరేగింపులో తమపై దాడి చేయబోయాడని అతని మీద కేసు పెట్టారు.

మరోవైపు ఊరేగింపులో జరిగిన అవమానం భరించలేక దివ్యను పెళ్లి కొడుకు తనకు వద్దని వెళ్లిపోయాడు. దీంతో వంశీనే పెళ్లి చేసుకుంటానని దివ్య పెద్దలతో చెప్పినట్లుగా తెలుస్తోంది. 

"

PREV
click me!

Recommended Stories

Raja Saab : నా చావు కోరుకుంటున్నారా? రాజాసాబ్ టికెట్ల రచ్చ.. తెగేసి చెప్పిన మంత్రి కోమటిరెడ్డి
Sankranti: సంక్రాంతికి ఊరెళ్తున్నారా.? ఇలా వెళ్తే ట్రాఫిక్ త‌ప్పించుకోవ‌చ్చు