ఉద్రిక్తత...గాంధీభవన్ లోనే కాంగ్రెస్ సీనియర్ల మధ్య గొడవ

By Arun Kumar PFirst Published Feb 2, 2019, 2:50 PM IST
Highlights

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్ లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అంబర్ పేటకు చెందిన వి. హన్మంతరావు, శ్రీకాంత్ వర్గీయులు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. దీంతో గాంధీభవన్ రణరంగంగా మారింది. 

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్ లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అంబర్ పేటకు చెందిన వి. హన్మంతరావు, శ్రీకాంత్ వర్గీయులు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. దీంతో గాంధీభవన్ రణరంగంగా మారింది. 

ఇటీవల కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా నియమితులైన భట్టి విక్రమార్కకు గాంధీభవన్ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరైన అంబర్‌పేట నియోవర్గ సీనియర్‌ నేత వి. హన్మంతరావు శ్రీకాంత్‌ అనచరులు అడ్డుకున్నారు. శ్రీకాంత్ కు టికెట్ రాకుండా వీహెచ్ అడ్డుకున్నారంటూ ఆరోపిస్తూ ఆందోళనుకు దిగారు. దీంతో వీహెచ్ వర్గీయులు వారిని అడ్డుకోడానికి ప్రయత్నించారు. దీంతో ఇరువర్గీయుల మధ్య ఘర్షణ చెలరేగి ఒకరిపై ఒకరు కుర్చీలను విసురుకున్నారు. 

బిసిలకు వీహెచ్ అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతడిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ సీఎల్సీ లీడర్ భట్టి చాంబర్ ముందు శ్రీకాంత్ తన అనుచరులతో కలిసి ఆందోళన చేపట్టాడు. వెంటనే వీహెచ్ తనకు క్రమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం వీహెచ్ పై బేగం బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 

ఇక ఈ గొడవ గురించి వీహెచ్ మాట్లాడుతూ...టికెట్ రానివారంతా ఇలా దాడులకు పాల్పడాలా? అంటూ ప్రశ్నించారు. నాకు కూడా టికెట్ రాలేదు...నేనేం చేయాలి అంటూ ఆవేధన వ్యక్తం చేశారు. ఇలా చేయడం పద్దతి కాదని...ఈ విషయంపై క్రమశిక్షణ కమిటికి ఫిర్యాదు చేస్తానని వీహెచ్ తెలిపారు. 
 

click me!