అప్సర హత్య కేసు: సాయికృష్ణతో సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయనున్న పోలీసులు

By narsimha lode  |  First Published Jun 16, 2023, 11:40 AM IST

అప్సర హత్య కేసు నిందితుడు  సాయికృష్ణను  కస్టడీలోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. రేపు మధ్యాహ్నంతో సాయికృష్ణ కస్టడీ ముగియనుంది. 
 



హైదరాబాద్: అప్సర  హత్య  కేసు నిందితుడు  సాయికృష్ణను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న  శంషాబాద్ పోలీసులు.సాయికృష్ణను రెండు రోజుల పాటు  కస్డడీకి అనుమతించింది కోర్టు. నిన్ననే  సాయికృష్ణను  పోలీసులు  కస్టడీలోకి తీసుకున్నారు. అప్సర హత్య కేసును విచారిస్తున్నారు. ఇవాళ రాత్రికి అప్సర హత్య కేసును సీన్ రీ కన్ స్ట్రక్షన్  చేయనున్నారు  పోలీసులు.  శంషాబాద్ మండలం సుల్తాన్ పూర్ వద్ద  అప్సరను హత్య చేసిన తర్వాత డెడ్ బాడీని  సరూర్ నగర్  తహసీల్దార్  కార్యాలయ ఆవరణలో ఉన్న మ్యాన్ హోల్ లో పూడ్చి పెట్టారు.

పెళ్లి  చేసుకోవాలని  అప్పర వేధించడం వల్లే  హత్య చేసినట్టుగా  సాయికృష్ణ  పోలీసులకు  తెలిపాడు.గతంలో  కూడ అప్సరను  హత్య చేసేందుకు  సాయికృష్ణ  ప్రయత్నించాడు.  కానీ  ఈ ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరికి  సుల్తాన్ పూర్ వద్ద  అప్సరను  సాయికృష్ణ హత్య చేశాడు.ఈ నెల  3వ తేదీన  అప్సరను  సాయికృష్ణ హత్య  చేశాడు. ఒక్క రోజు తర్వాత  మ్యాన్ హోల్ లో  పూడ్చిపెట్టాడు.  అయితే  అప్సర కన్పించకుండాపోయిందని  ఆమె తల్లితో కలిసి వెళ్లి శంషాబాద్ పోలీసులకు సాయికృష్ణ ఫిర్యాదు  చేశాడు.  ఈ ఫిర్యాదుపై విచారణ  నిర్వహించిన పోలీసులకు అసలు విషయం తెలిసింది.  సాయికృష్ణపైనే  పోలీసులకు అనుమానం వచ్చింది.ఈ దిశగా విచారణ  నిర్వహిస్తే  అప్సరను హత్య  చేసిన విషయాన్ని సాయికృష్ణ పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. 

Latest Videos

undefined

also read:పక్కా ప్లాన్‌తో హత్య: కారులోనే ఒక్క రోజంతా అప్సర డెడ్‌బాడీ

అప్సరను హత్య చేసేందుకు దారితీసిన పరిస్థితులపై  సాయికృష్ణ నుండి  పోలీసులు సేకరించనున్నారు. ఈ కేసుకు సంబంధించి  ఇతర కీలక  ఆధారాలను కూడ పోలీసులు  సేకరించే పనిలో ఉన్నారు.
 

click me!