బిసి అంటే బాయ్ కాట్ చంద్రశేఖర్ రావు: బండి సంజయ్ ఫైర్

Arun Kumar P   | Asianet News
Published : Apr 11, 2021, 01:58 PM ISTUpdated : Apr 11, 2021, 02:04 PM IST
బిసి అంటే బాయ్ కాట్ చంద్రశేఖర్ రావు: బండి సంజయ్ ఫైర్

సారాంశం

. బిసిలకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని... తన పార్టీలో ఎందరో బిసి  ఎమ్మెల్యేలు ఉండగా కేవలం నలుగురికే మంత్రి పదవులిచ్చారని తెలంగాణ బిజెెపి అధ్యక్షులు కేసీఆర్ విమర్శించారు. 

హైదరాబాద్: బిసి అంటే బాయ్ కాట్ చంద్రశేఖర్ రావు అనే నినాదందో రాష్ట్రంలోని బిసిలు ఉద్యమించాలని తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ పిలుపునిచ్చారు. బిసిలకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని... తన పార్టీలో ఎందరో బిసి  ఎమ్మెల్యేలు ఉండగా కేవలం నలుగురికే మంత్రి పదవులిచ్చారని విమర్శించారు. ఇలా అహంకారంతో ముఖ్యమంత్రి ఇష్టంవచ్చినట్లు వ్యవహరిస్తున్నారని... ఆ అహంకారాన్ని ఇకనైనా తగ్గించుకోవాలని సంజయ్  సూచించారు. 
 
బీజేపీ కార్యాలయంలో బహుజన తత్వవేత్త, సామాజిక దార్శనికుడు, మహాత్మా జ్యోతిరావు ఫూలే 195వ జయంతి (11ఏప్రిల్)  వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ... సీఎం కేసీఆర్‌ మహనీయుల చరిత్రను కనుమరుగు చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఖాళీగానే వున్నా మహనీయులకు నివాళి అర్పించడానికి వెనుకాడుతున్నారని సంజయ్ మండిపడ్డారు. 

ఇటీవల పెద్దపల్లి జిల్లా మంథనిలో జరిగిన బిజెపి సమరభేరీలో కూడా సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇకపై ఫామ్ హౌస్ నుండి బయటకు ఎలా వస్తావో చూస్తాం అని... బయటకు గుంజుకు వచ్చే రోజులు ముందున్నాయంటూ తీవ్రస్తాయిలో హెచ్చరించారు. మందు తాగి డ్రైవింగ్ చేస్తే తప్పు అయినప్పుడు, మందు తాగి రాష్ట్రాన్ని నడిపితే తప్పు కాదా అని ఎద్దేవా చేశారు. సనాతన ధర్మానికి ప్రతీక మంథని, కానీ నేడు నీ మాఫియాకు అడ్డాగా మారిందని దెప్పి పొడిచారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నుండి మంథని నియోజక వర్గానికి గానీ, రాష్ట్రంలోని ఏ ఒక్క ఎకరానికి గానీ నీళ్లు రాలేదు కానీ ముఖ్యమంత్రి కుటుంబం కోట్లు దోచుకుంటున్నారు అని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు కోసం తెలంగాణ సాధించుకుంటే  రాక్షసపాలన సాగుతోందని అన్నారు. రాష్ట్రంలో ప్రతి సంక్షేమ పథకానికీ కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు వస్తున్నా కూడా బీజేపీ ని అప్రతిష్ఠ పాలు జేస్తున్నారని,  డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కొరకు 1500 కోట్లు, కేంద్రం ఇచ్చిందని అన్నారు.

 నువ్వు హిందువు కాదా... హిందువుల పై దాడులు జరిగితే ఎందుకు స్పందించలేదని అని సంజయ్ ప్రశ్నించారు. బీజేపీ ఏ పార్టీకి, మతానికి వ్యతిరేకం కాదు అని అన్నారు. ఇన్నిజరుగుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు స్పందించడని సంజయ్ ప్రశ్నించారు.
 

PREV
click me!

Recommended Stories

Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే
School Holidays : ఈ గురువారం స్కూళ్ళకు సెలవేనా..? ఎందుకో తెలుసా?