గేమ్స్ ఆడుకోవడానికి ఫోన్ ఇస్తానని చెప్పి...

Published : Dec 24, 2018, 10:57 AM IST
గేమ్స్ ఆడుకోవడానికి ఫోన్ ఇస్తానని చెప్పి...

సారాంశం

గేమ్స్ ఆడుకోవడానికి స్మార్ట్ ఫోన్ ఇస్తానని ఆశచూపి.. నాలుగేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి  పాల్పడ్డాడు. ఈ సంఘటన సనత్ నగర్ లో చోటుచేసుకుంది. 

గేమ్స్ ఆడుకోవడానికి స్మార్ట్ ఫోన్ ఇస్తానని ఆశచూపి.. నాలుగేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి  పాల్పడ్డాడు. ఈ సంఘటన సనత్ నగర్ లో చోటుచేసుకుంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బిహార్ కి చెందిన ఇంజమామ్(19) అనే యువకుడు కుటుంబంతో సహా.. హైదరాబాద్ కి వలస వచ్చారు. ఇక్కడ సనత్ నగర్ లో స్థిరపడ్డారు. అదే ప్రాంతంలో.. బిహార్ నుంచి వలస వచ్చిన మరో కుటుంబం కూడా ఉంది. ఆ కుటుంబానికి చెందిన నాలుగేళ్ల బాలికపై ఇంజమామ్ కన్నుపడింది.

శనివారం.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గేమ్స్ ఆడుకోవడానికి స్మార్ట్ ఫోన్ ఇస్తానని ఆశచూసి.. ఇంజమామ్.. మైనర్ బాలికను ఇంటికి తీసుకువచ్చాడు. అనంతరం బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా.. తనకు జరిగిన విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు వివరించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

బాధిత బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు ఇంజమామ్ ని  పోస్కో చట్టం కింద అరెస్టు చేసి.. విచారిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!