బిందెలో చిక్కుకున్న పిల్లాడి తల.. బయటకు రాలేక అవస్థలు, వీడియో వైరల్

Siva Kodati |  
Published : May 13, 2021, 02:29 PM IST
బిందెలో చిక్కుకున్న పిల్లాడి తల..  బయటకు రాలేక అవస్థలు, వీడియో వైరల్

సారాంశం

కరీంనగర్ జిల్లాలో ఓ బాలుడి తల నీటి బిందెలో ఇరుక్కుపోయింది. జిల్లాలోని శంకరపట్నంకు చెందిన ఆరేళ్ల బాలుడు రోహిత్ ఆడుకుంటూ వెళ్లి బిందెలో తల పెట్టాడు. అయితే ఎంతకు తల బయటకు రాకపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు

కరీంనగర్ జిల్లాలో ఓ బాలుడి తల నీటి బిందెలో ఇరుక్కుపోయింది. జిల్లాలోని శంకరపట్నంకు చెందిన ఆరేళ్ల బాలుడు రోహిత్ ఆడుకుంటూ వెళ్లి బిందెలో తల పెట్టాడు. అయితే ఎంతకు తల బయటకు రాకపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు.

అతని ఏడుపు, కేకలు విన్న తల్లిదండ్రులు లోపలికి వచ్చి చూడగా.. బిందెలో చిన్నారి తల ఇరుక్కుపోయి కనిపించింది. దీంతో బాలుడి తలను బయటకు తీసేందుకు వారు నానా తంటాలు పడ్డారు.

ఎంతకు అది బయటకు రాకపోవడంతో స్థానికులు బిందెను కట్ చేసి చిన్నారిని రక్షించారు. దీంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

PREV
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే