మహబూబాబాద్‌లో కరోనాతో విషాదం: 11 రోజుల్లో ఒకే కుటుంబంలో నలుగురి మృతి

By narsimha lode  |  First Published May 13, 2021, 2:01 PM IST

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో  కరోనాతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. 11 రోజుల వ్యవధిలో నలుగురు మరణించడంతో గ్రామంలో విషాదం నెలకొంది. 


మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో  కరోనాతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. 11 రోజుల వ్యవధిలో నలుగురు మరణించడంతో గ్రామంలో విషాదం నెలకొంది. నెల్లికుదురు గ్రామానికి చెందిన  ఓ కుటుంబసభ్యులకు కరోనా సోకింది. ఒక్కొక్కరుగా ఈ వైరస్ బారిన పడిన వారంతా మృత్యువాతపడ్డారు.  కరోనా లక్షణాలు కన్పించడంతో కుటుంబసభ్యులు పరీక్షలు చేయించుకోవడంతో  కోవిడ్ నిర్ధారణ అయింది. దీంతో  వారంతా చికిత్స తీసుకొంటున్నారు. 

చికిత్స తీసుకొంటూనే ఈ నెల 2వ తేదీన కుటుంబ యజమాని మరణించారు. ఈ నెల 4న  పెద్ద కొడుకు చనిపోయాడు.  రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరూ చనిపోయారని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ నెల 11న చిన్న కొడుకు కూడ కరోనాతో మృతి చెందాడు. ఇవాళ తల్లి హైద్రాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది.

Latest Videos

undefined

also read:కరోనాతో విషాదం:ఎవరూ మాట్లాడడం లేదని వ్యక్తి ఆత్మహత్య

11 రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలో నలుగురు మరణించడంపై  గ్రామంలో విషాదం నెలకొంది. కరోనాతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే కుటుంబంలో పలువురు మృతి చెందిన ఘటనలు ఇటీవల అనేకం చోటు చేసుకొంటున్నాయి.కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఈ వైరస్ సోకితే వైద్యచికిత్స తీసుకొంటే  కోలుకొంటారు. అయితే వైరస్ బారినపడిన తొలి రెండు మూడు రోజుల్లోనే వైద్యుల సలహాతో చికిత్స తీసుకొంటే ఇబ్బందినుండి తప్పించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. 
 

click me!