వేడి వేడి సాంబార్ లో పడిన చిన్నారి మృతి.. మహాబూబాబాద్ లో దారుణం..

Published : Jan 03, 2022, 10:29 AM IST
వేడి వేడి సాంబార్ లో పడిన చిన్నారి మృతి.. మహాబూబాబాద్ లో దారుణం..

సారాంశం

వేడి సాంబార్ లో పడి తీవ్రంగా గాయపడిన బాలుడిని కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కాగా వారం రోజులపాటు చికిత్స పొందిన బాలుడు పరిస్థితి విషమించడంతో ఈ రోజు మృతి చెందాడు. బాలుడు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

మహబూబాబాద్ : జిల్లాలోని నర్సింహులపేట మండలం కౌసల్యాదేవిపల్లిలో విషాదం చోటు చేసుకుంది.  hot sambar లో పడిన బాలుడు మృతి (death) చెందాడు. వారం క్రితం ఖమ్మం జిల్లా కాకరవాయిలో మేనమామ ఇరుముడి ఫంక్షన్ కు వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు వేడి వేడి సాంబార్ లో పడ్డాడు. 

తీవ్రంగా గాయపడిన బాలుడిని కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కాగా వారం రోజులపాటు చికిత్స పొందిన బాలుడు పరిస్థితి విషమించడంతో ఈ రోజు మృతి చెందాడు. బాలుడు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

ఇదిలా ఉండగా, నిరుడు డిసెంబర్ లో ఓ చిన్నారి ఊయలకోసం కట్టిన చీర మెడకు చుట్టుకుని చనిపోయిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. క్రిస్మస్ సెలవుల సందర్భంగా మిత్రులతో కలిసి ఇంటి వెనుకాల చెట్టుకు చీరను కట్టి ఏర్పాటు చేసిన ఊయలలో ఆడుకున్నారు. ఇలా ఆడుకుంటుండగా చీరను మెలికలు వేస్తూ గుండ్రంగా తిప్పాడు. ఈ క్రమంలోనే బాలుడి మెడకు చీర గట్టిగా చుట్టుకుని ఊపిరాడకుండా చేసింది. చీర బిగుసుకుపోవడంతో మిత్రులు చూస్తుండగా పిల్లాడు మరణించాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా కోడూరు మండలంలో డిసెంబర్ 25న జరిగింది.

సూర్యాపేట మెడికల్ హాస్టల్లో ర్యాగింగ్ కలకలం..

కోడూరిలోని అంబటి బ్రాహ్మణయ్య కాలనీకి చెందిన రామాంజనేయులు, అంజలీ దేవి దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడి పేరు చైతన్య, రెండో కుమారుడి పేరు బాలవర్దన్. చిన్న కుమారుడు వడ్డెర కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా పాఠశాలలకు సెలవులు ఇచ్చిన సంగతి తెలిసిందే. 

ఈ సెలవుల్లో ఎప్పటిలాగే అన్నదమ్ములు చైతన్య, బాలవర్దన్‌లు కాలనీలోని ఇతర మిత్రులతో కలిసి ఆడారు. తమ ఇంటి వెనుక ప్రాంతంలో చెట్టుకు చీరతో కట్టిన ఊయలలో ఆడేందుకు చైతన్య, బాలవర్దన్‌లు మిత్రులతో కలిసి వచ్చారు. చైతన్య హుషారుగా ఊయలలోకి ఎక్కి ఆడాడు. అలా ఆడుకుంటూనే చీరను మెలిపెట్టాడు. ఊయలను గుండ్రంగా తిప్పాడు. అంతే.. అది తన ప్రాణం తీసింది. 

చీర గట్టిగా మెడకు బిగుసుకుపోవడంతో తోటి స్నేహితులు చూస్తుండగానే చైతన్య ఊపిరి వదిలాడు. చీర మధ్యలో మాట్లాడకుండా విగత జీవిలా మారిపోయాడు. భయంతో చిన్నారులు పరుగున వెళ్లి చైతన్య తల్లిదండ్రులకు విషయం చెప్పారు. తల్లిదండ్రులు వెంటనే ఊయల దగ్గరకు వెళ్లారు. కానీ, చైతన్య అప్పటికే ప్రాణాలు వదిలేశాడు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు