బోయిన్‌పల్లి కిడ్నాప్: గోవాలో నిందితుల ఎంజాయ్: అరెస్ట్, హైద్రాబాద్‌కి తరలింపు

Published : Jan 12, 2021, 06:06 PM IST
బోయిన్‌పల్లి కిడ్నాప్:  గోవాలో నిందితుల ఎంజాయ్: అరెస్ట్, హైద్రాబాద్‌కి తరలింపు

సారాంశం

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో నిందితులను గోవాలో కొందరిని అరెస్ట్ చేశారు.  గోవాలో అరెస్టైన నిందితులను మంగళవారం నాడు రాత్రికి హైద్రాబాద్ కు తరలించే అవకాశం ఉంది.

హైదరాబాద్: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో నిందితులను గోవాలో కొందరిని అరెస్ట్ చేశారు.  గోవాలో అరెస్టైన నిందితులను మంగళవారం నాడు రాత్రికి హైద్రాబాద్ కు తరలించే అవకాశం ఉంది.

ఈ నెల 5వ తేదీన బోయిన్ పల్లిలో ప్రవీణ్ రావు అతని సోదరులను కొందరు దుండగులు  కిడ్నాప్ చేశారు.ఈ కిడ్నాప్ కేసులో ఏపీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియతో పాటు పలువురిని హైద్రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు..

also read:కిడ్నాప్ కోసం తాత్కాలిక సిమ్ వాడిన అఖిలప్రియ: సీపీ అంజనీకుమార్

కిడ్నాప్ చేసిన నిందితుల్లో 16 మందిలో ఇప్పటికే కొందరిని అరెస్ట్ చేశారు పోలీసులు. మిగిలిన నిందితుల కోసం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ విచారణలో ఇవాళ భాగంగా  విజయవాడలోని నిందితుల ఇళ్లకు వెళ్లిన పోలీసులకు గాను నిందితులు గోవాలో ఉన్నారనే సమాచారం తెలిసింది.

ఈ సమాచారం ఆధారంగా గోవాలో ఉన్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొందరిని విజయవాడలో అదుపులోకి తీసుకొన్నారు. విజయవాడతో పాటు గోవాలో అదుపులోకి తీసుకొన్న వారిని ఇవాళ రాత్రికి హైద్రాబాద్ కు తరలించనున్నారు.

PREV
click me!

Recommended Stories

Dasara Special Trains: గుడ్ న్యూస్ చెప్పిన భారతీయ రైల్వే.. దసరా బతుకమ్మ ప్రత్యేక రైళ్లు
Weather Update: బంగాళాఖాతంలో ఆవర్తనం.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఈదురు గాలుల హెచ్చరికలు