
ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని తమ పార్టీ నేతలకు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పదే పదే చెబుతుంటారు. ఉద్యమసమయంలో ఉన్నట్లుగా ఆగ్రహావేశాలు పనికిరాదని, ప్రభుత్వ ఉద్యోగులతో కూడా సున్నితంగా వ్యవహరించాలని ఉపదేశిస్తుంటారు.
కానీ, ఏం లాభం పార్టీ పవర్లోకి వచ్చాక గులాబీ తమ్ముళ్లు ఎందుకు ఊరుకుంటారు. రాకరాకవచ్చిన అధికారం ఆ మాత్రం దర్పం ప్రదర్శించకపోతే విలువేముంటుంది.
అందుకే సందుదొరికితే చాలు భుజంపై గులాబీ కండువా వేసుకొని నోటి నిండా బూతులు నింపుకొని జనాలపై తమ ప్రతాపాన్ని ఇలా చూపిస్తున్నారు. నిన్న తీగల ఈ రోజు బోధన్ కు చెందిన ఈ చోటా నేత. ఈ వీడియో చూడండి. అధికార పార్టీ నేత బూతు పంచాంగం వినండి...