కేటీఆర్ ను సీఎంను చేయండి: కేసీఆర్ కు బోధన్ ఎమ్మెల్యే విజ్ఞప్తి

Published : Aug 15, 2020, 01:44 PM IST
కేటీఆర్ ను సీఎంను చేయండి: కేసీఆర్ కు బోధన్ ఎమ్మెల్యే విజ్ఞప్తి

సారాంశం

తెలంగాణ మంత్రి కేటీఆర్ విషయంలో బోధన్ ఎమ్మెల్యే షకీల్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ను తెలంగాణ ముఖ్యమంత్రిగా చేయాలని ఆయన సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు.

బోధన్: తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావును ముఖ్యమంత్రిని చేయాలనే డిమాండ్ ముందుకు వస్తోంది. కేటీఆర్ విషయంలో టీఆర్ఎస్ బోధన్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు.

కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలని ఆయన సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు యువనేత, డైనమిక్ లీడర్ కేటీఆర్ కు ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయని ఆయన అన్నారు. కేటీఆర్ ను సీఎం చేయాలని తాను కేసీఆర్ ను కోరుతున్నట్లు ఆయన తెలిపారు.

ఇటీవలి కాలంలో కేటీఆర్ అంతా తానే అయి వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. పార్టీ బాధ్యతలను కేసీఆర్ పూర్తిగా కేటీఆర్ కు అప్పగించారు. అయితే, ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా కేటీఆర్ ప్రధాన భూమిక పోషిస్తున్నారు. 

కేసీఆర్ తన కార్యకలాపాలను చాలా తగ్గించుకున్నట్లు ఇటీవలి పరిణామాలు తెలియజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా కేటీఆర్ హాజరవుతున్నారు. కేసీఆర్ వారసుడు కేటీఆర్ మాత్రమేనని మంత్రి శ్రీనివాస గౌడ్ తరుచుగా అంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే షకీల్ కేసీఆర్ కు ఆ విజ్ఞప్తి చేసినట్లు అర్థమవుతోంది.

PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?