
యాదాద్రిలోని (Yadadri district) కెమికల్ ఫ్యాక్టరీలో (chemical factory) భారీ పేలుడు (blast) చోటు చేసుకుంది. విస్ఫోటనం ధాటికి కెమికల్స్ ఎగిసిపడ్డాయి. అంతేకాకుండా ఫ్యాక్టరీ అంతా పొగ దట్టంగా కమ్ముకుంది. సైరన్ మోగడంతో భయంతో పరుగులు తీశారు కార్మికులు, అధికారులు. రియాక్టర్ పేలడం వల్ల సంఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.