ఎమ్మెల్యేని.. నాకే సలామ్ పెట్టవా: అర్థరాత్రి ఎంఐఎం నేత ముంతాజ్ అహ్మద్ ఖాన్ దౌర్జన్యం

Siva Kodati |  
Published : Dec 12, 2021, 04:03 PM IST
ఎమ్మెల్యేని.. నాకే సలామ్ పెట్టవా: అర్థరాత్రి ఎంఐఎం నేత ముంతాజ్ అహ్మద్ ఖాన్ దౌర్జన్యం

సారాంశం

హైదరాబాద్ (hyderabad) పాతబస్తీలో (old city) ఎంఐఎం (mim mla) ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ (mumtaz khan) హల్‌చల్ చేశారు.  అర్ధరాత్రి 12 గంటలకు గల్లీలో కూర్చున్న యువకుడు జిలానిపై చేయిచేసుకున్నారు ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్. దీంతో ఎమ్మెల్యేపై హుస్సేని అలం పీఎస్‌లో జిలాని ఫిర్యాదు చేశారు. 

హైదరాబాద్ (hyderabad) పాతబస్తీలో (old city) ఎంఐఎం (mim mla) ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ (mumtaz khan) హల్‌చల్ చేశారు.  ఛార్మినార్ బస్ డిపో సమీపంలో యువకుడిపై ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్‌ దాడి చేశారు. తాను కనిపిస్తే నమస్తే పెట్టలేదు అంటూ ముంతాజ్ ఖాన్ రచ్చ చేశారు. అర్ధరాత్రి 12 గంటలకు గల్లీలో కూర్చున్న యువకుడు జిలానిపై చేయిచేసుకున్నారు ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్. దీంతో ఎమ్మెల్యేపై హుస్సేని అలం పీఎస్‌లో జిలాని ఫిర్యాదు చేశారు. 

ఈ దాడిలో యువకుడికి ఎడమ చెవు దవడ భాగంలో గాయాలు అయినట్లు ఉస్మానియా వైద్యులు రిపోర్ట్ ఇచ్చారు. అయితే.. ఇప్పటి వరకు ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ పై కేసు నమోదు చేయలేదు హుసేని అలం పోలీసులు (hussaini alam) . దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యే ఇల్లు.. బాధితుని ఇల్లు సమీపంలోనే ఉండడం.. క్షణాల్లో అప్పటికే ఎంఐఎం కార్యకర్తలు గులామ్​గౌస్ జిలానీ ఇంటికి పెద్ద ఎత్తున చేరుకోవడంతో చార్మినార్​బస్టాండ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇదంతా అక్కడే ఉన్న సి.సి కెమెరాలో నిక్షిప్తమయ్యింది

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?