దెయ్యం వదిలిస్తానంటూ చిత్రహింసలు, చావుబతుకుల్లో బాలింత: భూత వైద్యుడు అరెస్ట్

Siva Kodati |  
Published : Aug 01, 2020, 04:13 PM ISTUpdated : Aug 01, 2020, 04:20 PM IST
దెయ్యం వదిలిస్తానంటూ చిత్రహింసలు, చావుబతుకుల్లో బాలింత: భూత వైద్యుడు అరెస్ట్

సారాంశం

కరీంనగర్ భూతవైద్యం పేరిట బాలింతను చిత్రహింసలు పెట్టిన భూత వైద్యుడు దొంగల శ్యామ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. భూత వైద్యం పేరుతో నిందితుడు బాధిత మహిళకు నరకం చూపాడు

కరీంనగర్ భూతవైద్యం పేరిట బాలింతను చిత్రహింసలు పెట్టిన భూత వైద్యుడు దొంగల శ్యామ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. భూత వైద్యం పేరుతో నిందితుడు బాధిత మహిళకు నరకం చూపాడు.

తల వెంట్రుకలు లాగుతూ కొట్టడంతో బాలింత మహిళ అపస్మారక స్థితికి చేరింది. పరిస్థితి విషమించడంతో ఆమెను నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కుందారంలో రజిత అనే మహిళ 4 నెలల క్రితం పాపకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి ఆమె అనారోగ్యంతో ఉండటంతో దయ్యం పట్టిందనే అనుమానంతో కుటుంబసభ్యులు భూత వైద్యుడు శ్యామ్‌ను ఆశ్రయించారు.

రజతను నిందితుడు తీవ్రంగా కొట్టటంతో పాటు చిత్రహింసలకు గురిచేయడంతో ఆమె అపస్మారక స్థితికి చేరింది. శంకరపట్నం మండలం గద్దపాక గ్రామానికి చెందిన కనుకుంట్ల రజిత కు కొద్దినెలల క్రితం మల్లేష్‌తో వివాహం జరిగింది. 

PREV
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే