పదేళ్ల క్రితం కులాంతర వివాహం.. పిల్లలు పుట్టకపోవడంతో...

Published : Aug 01, 2020, 01:13 PM IST
పదేళ్ల క్రితం కులాంతర వివాహం.. పిల్లలు పుట్టకపోవడంతో...

సారాంశం

వారికి పెళ్లై పదేళ్లు కావస్తున్నా.. సంతానం కలగలేదు. ఈ క్రమంలో దంపతుల మధ్య వివాదాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో పిల్లల కోసం వేరే పెళ్లి చేసుకోవాలని మాణిక్యప్ప భావించాడు. ఆ విషయం తెలిసి నర్సింగమ్మ కుంగిపోయింది. 

వారు ఒకరినొకరు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించుకున్నారు. కానీ వారి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. కులాలు అడ్డుగోడలుగా నిలిచాయి. అయితే.. వారు పెద్దలను ఎదురించి మరీ పెళ్లి చేసుకున్నారు. అయితే.. వారి ప్రేమ పెళ్లిలో కొన్ని అడ్డుగోడలు మొదలయ్యాయి. చివరకు భార్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మండలంలో యాంకి గ్రామానికి చెందిన నర్సింగమ్మ(25)ను అదే గ్రామానికి చెందిన మాణిక్యప్ప పదేళ్ల కిందట కులాంతర వివాహం చేసుకున్నారు. అయితే అప్పట్లో ఆ వివాహాన్ని వద్దని పెద్దలు నచ్చచెప్పారు. అయినా వారి మాట వినకండా పెళ్లి చేసుకున్న వారు ఒక్కటయ్యారు. అనంతరం వీరి జీవితం అన్యోన్యంగా సాగుతోంది. గ్రామంలో ఉపాధి లేకపోవడంతో హైదరాబాద్‌లో కూలీపనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో నాలుగునెలల కింద గ్రామానికి వచ్చారు.

అయితే.. వారికి పెళ్లై పదేళ్లు కావస్తున్నా.. సంతానం కలగలేదు. ఈ క్రమంలో దంపతుల మధ్య వివాదాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో పిల్లల కోసం వేరే పెళ్లి చేసుకోవాలని మాణిక్యప్ప భావించాడు. ఆ విషయం తెలిసి నర్సింగమ్మ కుంగిపోయింది. 

ఈ క్రమంలో గురువారం రాత్రి ఎప్పటిలాగే ఇద్దరూ భోజనం చేసి నిద్రించారు. తెల్లారేసరికి నర్సింగమ్మ ఇంట్లో ఓ గదిలో విగతజీవిగా పడి ఉంది. అయితే తన భార్య ఆత్మహత్య చేసుకుందని చుట్టుపక్కల వారికి సమాచారం అందించాడు. అయితే.. మాణిక్యప్పే కావాలని భార్యను  చంపేశాడంటూ నర్సింగమ్మ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే