మంత్రాల అనుమానంతో కన్నతల్లిని చంపిన కొడుకు

sivanagaprasad kodati |  
Published : Dec 25, 2018, 10:14 AM IST
మంత్రాల అనుమానంతో కన్నతల్లిని చంపిన కొడుకు

సారాంశం

మంత్రాల నెపంతో కన్నతల్లినే చంపాడు కొడుకు. అంతేకాకుండా అనుమానం రాకుండా ఉండేందుకు తల్లిది సహజ మరణమేనంటూ నమ్మించే ప్రయత్నం చేశాడు. వివరాల్లోకి వెళితే... రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన‌పల్లి మండలం విలాసాగర్ గ్రామానికి చెందిన నర్సయ్య, చంద్రవ్వ దంపతులకు కుమారుడు శ్రీనివాస్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 

కొడుకుకి వివాహమై.. కరీంనగర్ జిల్లా గంగాధరలో నివాసం ఉంటున్నాడు. జీవనోపాధి కోసం గల్ఫ్‌‌కు వెళ్లి అక్కడ అనారోగ్యం కారణంగా అర్నెల్ల క్రితం స్వదేశానికి తిరిగొచ్చాడు. అయితే తల్లి మంత్రాలు వేయడం వల్లనే తాను అనారోగ్యానికి గురవుతున్నట్లు అనుమానిస్తూ వచ్చిన శ్రీనివాస్.. ఇటీవల తన ఇంట్లో విరుగుడు పూజలు కూడా చేయించాడు.

ఎన్ని పూజలు చేయించినా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఆస్పత్రికి వెళ్లి పలు రకాల పరీక్షలు చేయించుకున్నాడు. వైద్యులు కూడా శరీరంలో ఏ లోపం లేదని అంతా బాగానే ఉందని నివేదిక ఇచ్చారు. దీంతో శ్రీనివాస్ అనుమానం మరింత బలపడింది.. ఇదంతా తల్లి మంత్రాల వల్లనేనని నమ్మాడు.

ఆదివారం రాత్రి ఒంటరిగా ఉన్న తల్లిని గొంతు నులిమి చంపేశాడు. అయితే నేరం తనపై రాకుండా ఉండేందుకు ‘‘బల్లపై నుంచి కింద పడి అమ్మ చనిపోయిందంటూ’’ తండ్రి నరసయ్యకు సమాచారమిచ్చాడు. అయితే అనుమానం కలిగిన నరసయ్య నిజం ఒప్పుకున్నాడు. ఆయన ఫిర్యాదు మేరకు శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

PREV
click me!

Recommended Stories

Top 5 Cleanest Railway Stations : దేశంలో అత్యంత పరిశుభ్రమైన రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
Christmas Holidays 2025 : ఒకటి రెండ్రోజులు కాదు... వచ్చే వారమంతా స్కూళ్ళకు సెలవులే..?