కాళేశ్వరం ప్రాజెక్టు సఃందర్భనకు తమకు అనుమతివ్వాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కు లేఖ రాశారు. ప్రాజెక్టు సందర్శనకు ఇరిగేషన్ నిపుణులతో పాటు తమ పార్టీ నేతలుంటారని బండి సంజయ్ చెప్పారు.
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు అనుమతివ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు.కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనలో బీజేపీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజా ప్రతినిధులుంటారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆ లేఖలో పేర్కొన్నారు.
ఈ టీమ్ లో నీటిపారుదల శాఖకు చెందిన నిపుణులతో పాటు 30 మంది సభ్యులుంటారని బండి సంజయ్ ఆ లేఖలో వివరించారు. ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో కాళేశ్వరం ప్రాజెక్టును బీజేపీ బృందం సందర్శించనుందని బండి సంజయ్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజక్టు నిర్మాణం, వరదలలో మునకపై సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నామని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై అనుమానాలను నివృత్తి చేసుకోనేందుకు ఈ టూర్ నిర్వహిస్తున్నామని బండి సంజయ్ తెలిపారు.
undefined
ఈ ఏడాది జూలై మాసంలో గోదావరి నదికి వచ్చిన వరదల కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పంప్ హౌస్ ముంపునకు గురైన విసయం తెలిసిందే. ఈ పంప్ హౌస్ ముంపునకు గురి కావడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని విపక్షాలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.
1998 కృష్ణానదికి వరదలు వచ్చిన సమయంలో కూడా శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో వరద నీరు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో విపక్షాలు శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించిన విషయాన్ని బండి సంజయ్ ఆ లేఖలో గుర్తు చేశారు. 2004 - 2009 లో జరిగిన జలయజ్ఞం పనులపై వచ్చిన విమర్శలకు ప్రతిపక్షాలను అప్పటి ప్రభుత్వం ఆహ్వానించి అనుమానాలను నివృత్తి చేసిందని బండి సంజయ్ ప్రస్తావించారు. ప్రభుత్వం వైపు నుండి కూడా ఇరిగేషన్ అధికారులను పంపి తమ సందేహాలను నివృత్తి చేయాలని బండి సంజయ్ ఆ లేఖలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరారు.