తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్ష ఆదివారం నాడు ప్రారంభమైంది.. రాష్ట్ర వ్యాప్తంగా 1601 పరీక్షా కేంద్రాల్లో కానిస్టేబుల్ రాత పరీక్ష నిర్వహించారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్ష ఆదివారం నాడు ప్రారంభమైంది. నిమిషం ఆలస్యమైనా కూడా పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఇవ్వడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 1601 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. పోలీస్ శాఖతో పాటు ఎక్సైజ్, రవాణా శాఖల్లో కానిస్టేబుళ్ల నియామకం కోసం ఇవాళ రాత పరీక్షను నిర్వహిస్తున్నారు. తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఈ నియామకపు ప్రక్రియను చేపట్టింది.
కానిస్టేబుల్ రాత పరీక్ష కోసం 6.61 లక్షల మంది అభ్యర్ధులు ధరఖాస్తు చేసుకున్నారు. అయితే హల్ టికెట్ పై అభ్యర్ధులు తమ ఫోటోను అంటించాని అధికారులు సూచించారు. అయితే చాలా మంది అభ్యర్ధులు హల్ టికెట్లపై ఫోటోలు అంటించి తీసుకు రాలేదు. అయితే పరీక్షా కేంద్రం వద్దకు వచ్చి ఫోటోల కోసం చివరి నిమిషంలో హాడావుడి పడ్డారు.
undefined
పోలీస్ శాఖలో15, 644 పోస్టులు, రవాణా శాఖలో 63 పోస్టులు, ఎక్సైజ్ శాఖలో 614 కానిస్టేబుల్ పోస్టులకు ఇవాళ రాత పరీక్ష నిర్వహించారు. పరీక్షా కేంద్రంలోకి అభ్యర్ధులు ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించడం లేదు. క్యాలుకులేటర్లు, ఫోన్లు వంటి వాటిని అనుమతివ్వలేదు. ఇవాళ ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభమైంది మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు.
కానిస్టేబుల్ రాత పరీక్ష కోసం పోలీసులు ఉన్నతాధికారులు నిన్న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షా కేంద్రాల సమీపంలో ట్రాఫిక్ రద్దీ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికారులు నిన్నటి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
పరీక్షా కేంద్రాల్లోకి ఇవాళ ఉదయం 9 గంటల నుండే అభ్యర్ధులను అనుమతించారు. బయోమెట్రిక్ పద్దతిలో అభ్యర్ధుల హాజరును నమోదు చేస్తారు. తమ చేతులపై టాటూలు, మెహిందీ వేసుకోవద్దని కూడా పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు సూచించింది.200 ప్రశ్నలకు 200 మార్కులుంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక్క మార్కును కేటాయించనున్నారు. ఈ రాత పరీక్షలో రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ స్టడీస్ పై అబ్జెక్టివ్ తరహలో ప్రశ్నలుంటాయి.పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్షలు జరిగే పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. హైద్రాబాద్ సహా రాష్ట్రంలోని 35 పట్టణాల్లో పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్ష నిర్వహణకు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లోని పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన ఇద్దరిని అధికారులుపరీక్షకుఅనుమతించలేదు., అల్వాల్్ లయోలా కాలేజీలో 5 నిమిషాలు ఆలస్యమైనా పరీక్షకు అనుమతించలేదు అధికారులు. మీర్ పేటలోని టీఆర్ఆర్ కాలజేపీలో ఆలస్యంగా వచ్చిన అభ్యర్ధిని పరీక్ష రాయడానికి వీల్లేదని అధికారులు అభ్యర్ధిని వెనక్కు పంపారు.