నిజామాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. సూపర్ మార్కెట్‌లో చెలరేగిన మంటలు.. భారీగా ఆస్తి నష్టం..!

Published : Aug 28, 2022, 09:55 AM IST
నిజామాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. సూపర్ మార్కెట్‌లో చెలరేగిన మంటలు.. భారీగా  ఆస్తి నష్టం..!

సారాంశం

నిజామాబాద్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జిల్లా కేంద్రంలోని ఆర్యనగర్‎లోని ఓ సూపర్ మార్కెట్‌లో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. 

నిజామాబాద్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జిల్లా కేంద్రంలోని ఆర్యనగర్‎లోని ఓ సూపర్ మార్కెట్‌లో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడటంతో సూపర్ మార్కెట్ కాలి బూడిదైనట్టుగా తెలుస్తోంది. దాదాపుగా రూ. 2 కోట్లకు పైగా ఆస్తినష్టం జరిగినట్లు యజమాని తెలిపారు. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే..  ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్‌నగర్ జిల్లాలో ఉన్న బ్రిటానియా కంపెనీలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 1:30 గంటలకు అగ్ని ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తోంది. దీంతో అక్కడివారు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి యత్నించారు. దాదాపు ఐదు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే భారీగా ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit: రూ.5.75 లక్షల కోట్ల భారీ ఒప్పందాలు.. ప్రపంచ దిగ్గజ సంస్థల క్యూ !
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్