నా ఫోన్ కేసీఆర్ వద్దే, రంగనాథ్ చిట్టా బయటపెడతా: బండి సంజయ్

By narsimha lode  |  First Published Apr 10, 2023, 5:54 PM IST

వరంగల్ సీపీ  రంగనాథ్  బండారం  బయటపెడతానని  బండి సంజయ్  వార్నింగ్  ఇచ్చారు.  


హైదరాబాద్: వరంగల్ సీపీ  రంగనాథ్  చిట్టా బయటపెడతానని  బీజేపీ తెలంగాణ  రాష్ట్ర అధ్యక్షుడు బండి   సంజయ్ చెప్పారు. సోమవారంనాడు  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి  సంజయ్  హైద్రాబాద్ లో  మీడియాతో మాట్లాడారు. 

నల్గొండ, ఖమ్మంలలో  నీవు  ఏమేం  చేశావో తనకు అన్నీ తెలుసునని  బండి సంజయ్ చెప్పారు. టెన్త్ క్లాస్  హిందీ పేపర్ లీక్  కుట్ర  కేసులో  తనపై బురదచల్లిన వరంగల్ సీపీ  రంగనాథ్ ను వదిలిపెట్టే  ప్రసక్తేలేదని బండి సంజయ్ తేల్చి చెప్పారు.  విజయవాడ సత్యం  బాబు  కేసులో  రంగనాథ్  ఏం చేశాడో  తెలుసునన్నారు.   రంగనాథ్  ఆస్తులు , ఆయన  చేసే దందాలు తనకు తెలుసునని  బండి  సంజయ్  చెప్పారు. తాను వేసుకున్న  ఖాకీ డ్రెస్ పై  రంగనాథ్  ప్రమాణం చేయాలని  బండి సంజయ్  కోరారు. 

Latest Videos

తన  ఫోన్  గురించి ప్రశ్నిస్తున్న వారికి  వరంగల్ సీపీ  రంగనాథ్ కాల్ లిస్ట్  బయట పెడితే  వాస్తవాలు  బయటకు వస్తాయని ఆయన  బండి సంజయ్ చెప్పారు. తన  ఫోన్  కేసీఆర్ వద్దే  ఉందని ఆయన  ఆరోపించారు.  మంత్రులు, బీఆర్ఎస్ నేతలు  తన కు  ఫోన్  చేస్తున్న విషయం తెలుసుకుని కేసీఆర్ బయపడ్డాడని  బండి సంజయ్  ఎద్దేవా చేశారు.  ఈ విషయం తెలుసుకున్న  కేసీఆర్  కు నిద్ర పట్టడం లేదన్నారు.  

తన  అత్తమ్మ  చనిపోతే  దశదినకర్మకు హాజరుకాకుండా  అడ్డుకున్నారని  బండి సంజయ్  చెప్పారు.  తన బెయిల్ ఎందుకు  రద్దు  చేయాలో  చెప్పాలని ఆయన  పోలీసులను  కోరారు.  తెలంగాణలో  నిరుద్యోగ  యువత  ఆత్మహత్య  చేసుకుందని  బండి సంజయ్  ఆరోపించారు . తెలంగాణ రాష్ట్రం  ఎందుకు సాధించుకున్నామో  ఆ లక్ష్య సాధన  దిశగా  కేసీఆర్ పాలన  లేదని  బండి  సంజయ్ విమర్శించారు.కేసీఆర్ కు మానవ సంబంధాలు  కాదు, మనీ సంబంధాలు కావాలన్నారు. తన కుటుంబం  మాత్రమే  బాగుండాలనేది  కేసీఆర్  అభిమతమని  బండి  సంజయ్  విమర్శించారు.  

also read:టెన్త్ క్లాస్ పేపర్ లీక్ : వరంగల్ సీపీపై బండి సంజయ్ పరువు నష్టం దావా

గతంలో  కూడా  రేవంత్ రెడ్డిని ఇలానే వేధించారని  బండి సంజయ్  చెప్పారు.   నిజాం షుగర్ ఫ్యాక్టరీ,  సిర్పూర్ కాగజ్ నగర్ మిల్లులను  ఎందుకు  తెరిపించడం లేదని  ఆయన  ప్రశ్నించారు.  టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీక్  కేసులో కేటీఆర్ ను భర్తరఫ్  చేయాలని  బండి  సంజయ్ డిమాండ్  చేశారు. టీఎస్‌పీఎస్‌సీ అంశం  తెరమీదికి  రాకుండా  ఉండేందుకు  టెన్త్ క్లాస్ పేపర్ లీక్ అని  నాటకం ఆడుతున్నారని  బండి సంజయ్ ఆరోపించారు. 
 

click me!