టీఆర్ఎస్ మెడలు వంచాలంటే బీజేపీని గెలిపించాలి: బండి సంజయ్

Published : Feb 22, 2021, 03:21 PM IST
టీఆర్ఎస్ మెడలు వంచాలంటే బీజేపీని గెలిపించాలి: బండి సంజయ్

సారాంశం

తెలంగాణలో గడీల పాలన కొనసాగుతోందని  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.


హైదరాబాద్: తెలంగాణలో గడీల పాలన కొనసాగుతోందని  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.సోమవారం నాడు ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ మెడలు వంచాలంటే బీజేపీని గెలిపించాలని ఆయన కోరారు. కేసీఆర్ ప్రగతి భవన్ కే పరిమితమయ్యారని ఆయన చెప్పారు.

జీహెచ్ఎంసీలో బీజేపీకి అధిక స్థానాలు గెలిపించడంతో ఎల్ఆర్ఎస్ పారిపోయిందని ఆయన చెప్పారు. రానున్న అన్ని ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడిస్తే పేదలకు ప్రయోజనం కలుగుతుందని ఆయన చెప్పారు.రెండు ఎమ్మెల్సీ స్థానాలతో పాటు నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కూడ బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలని ఆయన కోరారు. ఆరేళ్లుగా రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ సర్కార్ ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు.

దుబ్బాక ఉప ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలను సాధించింది. దుబ్బాకలో బీజేపీ విజయం సాధించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 కార్పోరేట్ స్థానాలను బీజేపీ దక్కించుకొంది. రెండు ఎమ్మెల్సీ, నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానాలపై బీజేపీ కేంద్రీకరించింది.  

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?