వికారాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ మాజీ ఎంపీపీ భర్త దారుణ హత్య

Published : Feb 22, 2021, 12:56 PM IST
వికారాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ మాజీ ఎంపీపీ భర్త దారుణ హత్య

సారాంశం

తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీపీ వాణిశ్రీ భర్త వీరప్ప దారుణ హత్యకు గురయ్యాడు. పెద్దల మధ్య పంచాయతీ జరుగుతుండగానే రాళ్లతో ఆయనను కొట్టి చంపారు.

వికారాబాద్: తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో దారుణ హత్య జరిగింది. అందరూ చూస్తుండగానే ఈ హత్య సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని పెద్దేముల్ మండలం టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీపీ వాణిశ్రీ భర్త వీరప్ప దారుణ హత్యకు గురయ్యాడు.

పెద్దముల్ మండలంలోని హన్మాపూర్ గ్రామంలో గల ఆంజనేయ స్వామి గుడి వద్ద సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ హత్య జరిగింది.  గ్రామ పెద్దల మధ్య పంచాయతీ జరుగుతుండగా కొంత మంది వీరప్పపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. 

తాండూరులోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే వీరప్ప మరణించాడు. ఇసుక వ్యవహారంలో ఈ హత్య జరిగినట్లు భావిస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే