కేసీఆర్.. నీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది: బండి సంజయ్

By narsimha lodeFirst Published Jan 18, 2022, 9:53 PM IST
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. 317 జీవోతో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఇబ్బంది  పడుతున్నారన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు

హైదరాబాద్: 317 జీవో వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతుంటే కేబినెట్ మీటింగ్ లో ఆ ప్రస్తావన లేకపోవడం దుర్మార్గమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay విమర్శించారు.సీఎం.... నీ డౌన్ ఫాల్ స్టార్టయ్యిందన్నారు..

మంగళవారం నాడు ఆయన  మీడియాతో మాట్లాడారు.కేబినెట్ భేటీ ఓ టైం పాస్ మీటింగ్ అంటూ ఆయన విమర్శించారు.గంటల తరబడి మీటింగ్ పేరుతో రాష్ట్రంలోని అన్ని సమస్యలు పరిష్కారమైనట్లు షో చేస్తున్నారన్నారు.

సీఎం Kcrకి ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్య పట్టవా అని ఆయన ప్రశ్నించారు.ప్రశాంతంగా నిరసన తెలుపుతున్నemployees ఉపాధ్యాయులను, బీజేపీ నాయకులను అరెస్టు చేసి జైలుకు పంపడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా వెంటనే స్పందించి 317 జీవో వల్ల ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాలన్నారు. 

ఉద్యోగులు, Teachersకు అండగా బీజేపీ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.రాబోయే రోజుల్లో వర్చువల్ ద్వారా ఉద్యోగ, ఉపాధ్యాయులతో కేంద్ర నాయకత్వంతో మీటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. 317 జీవోను సవరించేదాకా సీఎంను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు.

corona విషయంలో ప్రజలు ఇబ్బంది పడొద్దు.  సమస్య తలెత్తితే వెంటనే డాక్టర్లను సంప్రదించి వైద్య సాయం పొందాలని ఆయన కోరారు.భారత్ లో వాక్సినేషన్ ప్రారంభించి ఏడాది పూర్తయిందని ఆయన గుర్తు చేశారు.   ఇప్పటికే158 కోట్ల డోసులు పూర్తయ్యాయన్నారు.     తెలంగాణలో సీఎం కేసీఆర్ కోవిడ్ అంశంలో వ్యవహరించిన తీరు విస్మయం కలిగిస్తోందన్నారు. . ఉద్యోగ ఖాళీల కోసం మళ్లీ ఇంకో కమిటీ వేస్తాననడం విడ్డూరమన్నారు. ఇంకా ఎన్ని కమిటీలు వేస్తారని ఆయన ప్రశ్నించారు.

ఇప్పటికే బిశ్వాల్ కమిటీ, సీఎస్ కమిటీ, హరీష్ తో వేసిన కమిటీలు ఏమాయ్యాయని ఆయన అడిగారుకమిటీల పేరుతో కాల యాపన చేయడమే సీఎం పని అని ఆయన విమర్శించారు.ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడానికి అభ్యంతరం లేదన్నారు. స్కూళ్లలో విద్యా వలంటీర్లు లేరు. టీచర్లు లేరు. వాళ్లు లేకుండా స్కూళ్లెలా నడిపిస్తారని బండి సంజయ్ ప్రశ్నించారు.

కార్పొరేట్ స్కూళ్ల నుండి పైసలు దొబ్బడానికే ఈ కొత్త డ్రామా ఆడుతున్నరని ఆయన ఆరోపించారు. గతేడాది రూ. 4వేల కోట్లు స్కూళ్లకు ఇస్తున్నట్లు ప్రకటించిన హామీలకు దిక్కులేదన్నారు. తన పాదయాత్రలో ఎక్కడికి వెళ్లినా శిథిలావస్థలో ఉన్న స్కూళ్లే కన్పించాయని ఆయన తెలిపారు.

 317 జీవో విషయంలో ప్రజల దృష్టిని మళ్లించడానికే సీఎం డ్రామాలాడుతున్నారని ఆయన విమర్శించారు. సీఎంకు ఇంత శాడిస్టు ఆలోచన ఎందుకు వస్తుందో అర్ధం కాలేదన్నారు. వరి ధాన్యం విషయంలో జనవరి 31 దాకా కొనాలని కేంద్రం చెప్పింది. సీఎం కొత్త డ్రామాలాడొద్దనా చెప్పారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, కోశాధికారి బి.శాంతికుమార్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి కుమార్, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎస్.ప్రకాశ్ రెడ్డి, రాష్ట్ర నాయకులు ఎన్వీ సుభాష్, జె.సంగప్ప తదితరులు పాల్గొన్నారు.

click me!