
Telangana: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్) పరిధిలోని మన్ననూర్-దోమలపెంట రహదారిపై వాహనాలు నడిపే వాహనదారులు అతివేగంతో వాహనాలు నడుపుతున్నారు. ఈ క్రమంలో ప్రమాదలు పెరుగుతున్నాయి. అయితే, ఇలా ఓవర్ స్పీడ్ తో రోడ్లపై దూసుకెళ్తూ.. ప్రమాదాలకు కారణమవుతున్న వారికి అధికారులు చెక్ పెట్టబోతున్నారు. అమ్రాబాద్ అటవీ ప్రాంత అధికారులు ఇటీవల కొనుగోలు చేసిన స్పీడ్ లేజర్ గన్ లను ఉపయోగించి.. వాహనాల వేగ పరిమితులను ఖచ్చితంగా అమలు చేయడానికి సిద్ధమయ్యారు. ఆయా రోడ్లపై విధించిన వాహనాల వేగం పరిమితి దాటితే జరిమానాలు విధిస్తామని చెబుతున్నారు.
అమ్రాబాద్ టైగర్ రిజర్వు అటవీ ప్రాంత రోడ్లపై వాహనాల వేగ పరిమితి 40 kmph అయితే వాహనదారులు ఈ వేగ నిబంధనలను చాలా అరుదుగా పాటిస్తారు. చాలా మంది వాహనదారులు అధిక వేగంతో వాహనాలను నడపడంతో, వన్యప్రాణులు ప్రమాదాలలో చనిపోవడం లేదా గాయపడిన సంఘటనలు నిత్యం నమోదవుతున్నాయి. శనివారం ఉదయం వటవర్లపల్లి సమీపంలోని బోర్డిబావి వద్ద కారు ఢీకొని మచ్చల జింక మృతి చెందింది. వాహనదారులు స్పీడ్ లిమిట్‌లో ఉండేలా చూసేందుకు, వన్యప్రాణులను చంపడం లేదా తీవ్ర గాయాలపాలు చేసే ప్రమాదాలను నియంత్రించేందుకు, నిరోధించేందుకు ఏటీఆర్ అధికారులు స్పీడ్ లేజర్ గన్‌లను కొనుగోలు చేశారని సీనియర్ ఏటీఆర్ అధికారి వెల్లడించారు.
ముఖ్యంగా మన్ననూర్ - దోమలపెంట మార్గం శ్రీశైలానికి వెళ్లడం వల్ల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వేగ పరిమితులను సూచిస్తూ అనేక చోట్ల సైన్ బోర్డులు ఉన్నప్పటికీ, చాలా వాహనాలు 60 kmph నుండి 80 kmph వరకు అధిక వేగంతో నడుస్తాయి. ముందుజాగ్రత్త చర్యగా ఈ మార్గంలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అటవీ శాఖ వాహనాలను అనుమతించడం లేదు. ఈ చర్యలు తీసుకున్నప్పటికీ, ATR పరిమితుల్లో వన్యప్రాణులు ప్రమాదాలలో చనిపోతూనే ఉన్నాయి, ప్రతి నెల సుమారు 40 నుండి 50 సంఘటనలు నమోదవుతున్నాయని ఆయన అన్నారు.
“ప్రస్తుతం, మాకు స్పీడ్ లేజర్ గన్ లు అందుబాటులోకి వచ్చాయి. వీటి వినయోగం, వేగ పరిమితులపై ట్రయల్ రన్‌లు జరుగుతున్నాయి. మరికొన్నింటిని కొనుగోలు చేయడానికి ప్రణాళికలు ఉన్నాయి, అయితే ఈ ప్రాంతంలో రెండు నెలల పాటు ఓవర్ స్పీడ్ ప్రతికూల ప్రభావంపై మేము మొదట వాహనదారులకు అవగాహన కల్పిస్తాము. ఉన్నతాధికారుల నుంచి అనుమతి పొందిన తర్వాత ఓవర్ స్పీడ్‌కు జరిమానా కూడా విధిస్తామని సదరు అధికారి వివరించారు. స్పీడ్ లేజర్ గన్‌లను ఉపయోగించి, అటవీ సిబ్బంది వాహనాల చిత్రాలను తీయడంతోపాటు ఉల్లంఘించిన వారిపై జరిమానా విధిస్తారు. స్పీడ్ లేజర్ గన్‌లు వ్యూహాత్మక ప్రదేశాలలో ఉంచబడతాయి. పెట్రోలింగ్ వాహన బృందాలు, ఇతర అధికారులు మన్ననూర్ చెక్‌పోస్ట్ లేదా దోమలపెంట చివరలో వేగం పరిమితులను ఉల్లంఘించిన వారిని నిలువరిస్తారు. కాగా, ఈ ప్రమాదాలను తగ్గించడానికి మన్ననూర్ నుంచి దోమలపెంట వరకు 22 స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్) విజ్ఞప్తులపై రోడ్లు, భవనాల శాఖకు చెందిన హైవే విభాగం స్పందించలేదని సమాచారం.
గత ఏడాది ఏటీఆర్ అధికారులు 22 ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి వాహనాల వేగాన్ని తగ్గించేందుకు స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని ఆర్‌అండ్‌బీ శాఖను కోరారు. ఇంకా ఎలాంటి స్పందన రాలేదని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో వీటిని ఏర్పాటు చేయవచ్చని ATRకి చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.