మోడీని అవమానిస్తే ఊరుకోం: కేసీఆర్‌ సేల్స్ మెన్ వ్యాఖ్యలపై బండి సంజయ్ కౌంటర్

Published : Jul 03, 2022, 10:50 AM ISTUpdated : Jul 03, 2022, 11:00 AM IST
మోడీని అవమానిస్తే ఊరుకోం: కేసీఆర్‌ సేల్స్ మెన్ వ్యాఖ్యలపై బండి సంజయ్ కౌంటర్

సారాంశం

 ప్రధాని నరేంద్ర మోడీపై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన విమర్శలకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటరిచ్చారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు మోడీ బెస్ట్ సేల్స్ మెన్ గా పనిచేశారన్నారు. ప్రధానిని అవమానించేలా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమన్నారు. 

హైదరాబాద్: Corona లాక్ డౌన్  సందర్భంగా Telangana ప్రజల ప్రాణాలను కాపాడేందుకు  PPE కిట్స్, ఆక్సిజన్, వెంటిలేటర్స్ సరఫరా చేసినందుకు ప్రధాని Narendra Modi  బెస్ట్ సేల్స్ మెన్ అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay  చెప్పారు.

ఈ నెల 2న ప్రధాని నరేంద్ర మోడీపై తెలంగాణ సీఎం KCR తీవ్ర విమర్శలు చేశారు. ప్రధానమంత్రిగా కాకుండా ప్రధానమంత్రి మోడీ సేల్స్ మెన్ గా వ్యవహరిఃస్తున్నాడని విమర్శలు చేశారు.ఈ వ్యాఖ్యలపై ఆదివారం నాడు BJP తెలంగాణ రాష్ల్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ప్రజల కోసం పనిచేయడం సేల్స్ మెన్ అయితే మోడీ  మంచి సేల్స్ మెన్  అంటూ బండి సంజయ్ చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మాదిరిగా ప్రభుత్వ భూములను విక్రయించలేదని ఆయన ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీపై విమర్శలు చేసే ముందు తెలివి ఉండాలని కేసీఆర్ పై బండి సంజయ్ మండిపడ్డారు. 

also read:బీజేపీ జాతీయ కార్యవర్గసమావేశాలు: నేడు తెలంగాణపై కీలక ప్రకటన చేసే చాన్స్

ప్రతిసారీ ఏదో ఒక్కటి మాట్లాడి సమస్యను పక్కదారి పట్టించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు. ప్రధానిని అవమానిస్తే ప్రజలు ఊరుకోరని ఆయన కేసీఆర్ ను హెచ్చరించారు. కేసీఆర్ వ్యవహరశైలిని బండి సంజయ్ తప్పు బట్టారు. విమర్శలు చేసే ముందు  ఆలోచించుకోవాలని ఆయన కేసీఆర్ కు సూచించారు.

విపక్షపార్టీల రాష్ట్రపతి అభ్యర్ధి Yashwant Sinha ఈ నెల 2న హైద్రాబాద్ కు వచ్చారు. యశ్వంత్ సిన్హాను TRS  ప్రజా ప్రతినిధులకు పరిచయం చేసే కార్యక్రమం సందర్భంగా జల విహార్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేసీఆర్ ప్రధానిపై విమర్శలు చేశారు.

గత కొంతకాలంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. బీజేపీ National Executive Meeting నేపథ్యంలో ఈ మాటల యుధ్దం మరింత పెరిగింది.  ప్రధాని నరేంద్ర మోడీకి కేసీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. దేశాన్ని మోడీ విధానాలు అధోగతి పాలు చేస్తున్నాయని కూడా ఆయన విమర్శలు చేశారు.ఈ విమర్శలపై బండి సంజయ్ స్పందించారు.  బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో రానున్న రోజుల్లో ఎన్నికలు రిగే రాష్ట్రాల్లో  అనుసరించాల్సిన వ్యూహాన్ని రచించనున్నారు  మరో వైపు  తెలంగాణపై కూడా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కమలం పార్టీ కేంద్రీకరించనుంది.  రాజకీయ తీర్మానం తర్వాత  తెలంగాణ విషయమై బీజేపీ జాతీయ నాయకత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ  రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైద్రాబాద్ లో ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలోని పార్టీ క్యాడర్ లో ఉత్సాహం  నింపడానికి ఆ పార్టీ నాయకత్వం ప్రయత్నాలు చేస్తుంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆ పార్టీ అగ్ర నేతలు రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నేతల ఇళ్లలో బస చేశారు. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్ధేశం చేశారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం
Top 5 Cleanest Railway Stations : దేశంలో అత్యంత పరిశుభ్రమైన రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?