తెలంగాణ సీఎం కేసీఆర్ ను ప్రజలే పట్టించుకోవడం లేదని, ఆయనను మేం కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు.
హైదరాబాద్: తెలంగాణ సీఎం KCR ను ప్రజలే పట్టించుకోవడం లేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay చెప్పారు.
Secunderabad పరేడ్ గ్రౌండ్స్ లో వచ్చే నెల 3న నిర్వహించే BJP బహిరంగ సభకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదివారం నాడు భూమి పూజ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాస్ట్రంలో మార్పు కోసం బీజేపీ పనిచేస్తుందన్నారు. Telangana లో ఒక్కసారి తమకు అవకాశం ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు. బీజేపీ కట్టడికి సీఎంఓలో సీఎం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారని బండి సంజయ్ ఆరోపించారు. పులి వస్తే జింక పారిపోయినట్టుగా మోడీ హైద్రాబాద్ వస్తే కేసీఆర్ పారిపోతున్నాడని ఆయన ఎద్దేవా చేశారు.
undefined
వచ్చే నెల 3న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణలో పార్టీ పాలసీని ప్రకటించేందుకు , ప్రజలను చైతన్యం చేసేందుకు ఈ సభను నిర్వహిస్తున్నామన్నారు. 10 లక్షల మందితో సభను నిర్వహించనున్నట్టుగా బండి సంజయ్ చెప్పారు. బూత్ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి నేతల వరకు ఈ సభను విజయవంతం చేసేందుకు గాను సమావేశాలు నిర్వహించామన్నారు. అంతేకాదు కమిటీలు కూడా ఏర్పాటు చేసినవ విషయాన్ని బండి సంజయ్ గుర్తు చేశారు. ప్రజలంతా ఈ సభకు స్వచ్చంధంగా రావాలని కూడా ఆయన కోరారు.
ఈ ఏడాది జూలై 2, 3 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైద్రాబాద్ లో జరగనున్నాయి. దక్షిణాదిపై ప్రధానంగా తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో బీజేపీ ముందుకు సాగుతుంది. ఈ తరుణంలో హైద్రాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను ఏర్పాటు చేశారు. జాతీయ కార్యవర్గ సమావేశాల దృష్ట్యా హైద్రాబాద్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని కమలదళం భావిస్తుంది. 10 లక్షలతో ఈ సభను నిర్వహించాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తుంది.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దక్షిణాదిపై ప్రధానంగా కేంద్రీకరించింది. 2015లో బెంగుళూరులో, 2016 లో కోజికోడ్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహించారు. ఈ దఫా హైద్రాబాద్ లో నిర్వహిస్తున్నారు.
also read:బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు.. భద్రతా ఏర్పాట్లపై హైదరాబాద్ పోలీసుల సమీక్ష
జూలై మొదటి వారంలో హైదరాబాద్‌లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలపై పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేయనున్నారు. . నోవాటెల్‌లో రెండు రోజుల పాటు బీజేపీ సమావేశాలు జరగనున్నాయి. పరేడ్ గ్రౌండ్‌లో బహిరంగ సభలో భద్రతా ఏర్పాట్లపై హైదరాబాద్ పోలీసులు సమీక్ష నిర్వహించారు. ప్రధాని బస , నోవాటెల్‌లో జరిగే సమావేశాలకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. ప్రధాని ప్రయాణించే మార్గాల్లో రూప్‌టాప్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.
రానున్న ఎన్నికల్లో పార్టీ వ్యూహంపై జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించనున్నారు. ఈ సమావేశాల్లో ప్రధాని మోదీ తో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా , కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితర నాయకులు పాల్గొననున్నారు.