బీజేపీకి రాష్ట్రంలో వస్తున్న ఆదరణను చూసి కేసీఆర్ భయపడుతున్నారని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ చెప్పారు. రాష్ట్రంలో నిజాం పాలన కొనసాగుతుందన్నారు.
హైదరాబాద్: బీజేపీకి రాష్ట్రంలో వస్తున్న ఆదరణను చూసి కేసీఆర్ భయపడుతున్నారని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ చెప్పారు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బండి సంజయ్ తెలిపారు. రాష్ట్రంలో నిజాం పాలన కొనసాగుతుందని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ పాలనలో డబ్బులు ఇవ్వనిదే ఏ పని కావడం లేదని బండి సంజయ్ విమర్శించారు. ప్రజల్లో రాజకీయ వ్యవస్థపై చీత్కారానికి కేసీఆర్ కారణమన్నారు..ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం ముందుకు వెళ్తుందన్నారు. ప్రపంచం మొత్తం భారత్ ను చూసి గర్వపడుతుందని చెప్పారు.కేసీఆర్, కేటీఆర్ లు చైనాను పొగుడుతున్నారని బండి సంజయ్ విమర్శించారు. ఏ స్కాంలోనైనా కేసీఆర్ కుటుంబ సభ్యులుంటారని ఆయన ఆరోపించారు.
also read:కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు అనుమతివ్వండి: సీఎస్ కు బండి సంజయ్ లేఖ
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాత్మకంంగా బీజేపీ పావులు కదుపుతుంది. ఇతర పార్టీల నుండి కీలక నేతలను తమ పార్టీలో చేర్చుకొనేందుకు బీజేపీ నాయకత్వం ప్రయత్నాలు చేస్తుంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ నెల 21న బీజేపీలో చేరారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు మరికొందరు నేతలు కూడా బీజేపీలో చేరుతారని ప్రచారం సాగింది. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మినహా మిగిలిన నేతలు ఎవరూ కూడా బీజేపీలో చేరలేదు. త్వరలోనే మరికొందరు నేతలు బీజేపీలో చేరనున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.