మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆఫీసులో పనిచేసే యువకుడి ఆత్మహత్య..

Published : Aug 28, 2022, 03:42 PM IST
మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆఫీసులో పనిచేసే యువకుడి ఆత్మహత్య..

సారాంశం

నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కార్యాలయంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. 

నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కార్యాలయంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆత్మహత్య చేసుకున్న యువకుడిని మంత్రి కార్యాలయంలో ఆఫీస్ బాయ్‌గా పనిచేస్తున్న దేవేందర్‌గా గుర్తించారు. వివరాలు.. మంత్రి ప్రశాంత్ రెడ్డి కార్యాలయంలోని ఓ గదిలో దేవేందర్ ఉరివేసుకున్నాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే అతడు మార్గమధ్యలోనే చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. 

ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. దేవేందర్ ఓ మహిళతో సన్నిహితంగా మెలిగినట్టుగా ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆమెకు తాను చనిపోతున్నానని మెసేజ్ పంపినట్టుగా తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్టుగా చెప్పారు. ఇక, దేవేందర్ అర్ధరాత్రి వరకు ఆమెతో ఫోన్‌లో చాట్ చేసిన తర్వాత ఉరి వేసుకున్నట్టుగా తెలుస్తోంది. 
 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert: బ‌య‌ట‌కు వెళ్లే ముందు జాగ్ర‌త్త‌.. ఈ ప్రాంతాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ
Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే