కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్: యాదాద్రికి బయలుదేరిన బీజేపీ తెలంగాణ చీఫ్

By narsimha lode  |  First Published Oct 28, 2022, 10:31 AM IST

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు  బండి  సంజయ్  యాదాద్రి పర్యటనకు బయలు దేరారు.  యాదాద్రికి రావాలని కేసీఆర్  ను  కోరారు  బండి సంజయ్ .


మర్రిగూడ:బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మర్రిగూడ  నుండి యాదాద్రి  పర్యటనకు బయలు దేరి వెళ్లారు.  యాదాద్రి  లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రమాణం చేసేందుకు  రావాలని ఆయన కేసీఆర్ నుకోరారు.అయితే బండి  సంజయ్  యాదాద్రి పర్యటనకు అనుమతి  లేదని పోలీసులు చెబుతున్నారు.

తమ  పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ  గురి  చేసిందని టీఆర్ఎస్ ఆరోపించింది. ఈ ఆరోపణలపై యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో  శుక్రవారం నాడు  ప్రమాణం చేసేందుకు  రావాలని బీజేపీ  రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  సీఎం కేసీఆర్ కు నిన్న సవాల్  చేసిన విషయం  తెలిసిందే.యాదాద్రి లక్ష్మీ నరసింహాస్వామి ఆలయానికి ప్రమాణం చేసేందుకు కేసీఆర్ రాకపోతే ఈ డ్రామా వెనుక కేసీఆరే ఉన్నారని భావించాల్సి వస్తుందని కూడా బీజేపీ ప్రకటించింది.

Latest Videos

మొయినాబాద్ ఫాంహౌస్ లో  టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి  చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో  ముగ్గురిని మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై పీడీ యాక్ట్  వర్తించదని నిన్న రాత్రి  జడ్జి చెప్పారు. ముగ్గురు  నిందితులను విడుదల చేయాలని ఆదేశించారు. అంతేకాదు 41 సీఆర్‌పీసీ  సెక్షన్ కింద విచారణ చేయాలని జడ్జి కోరారు.

also read:కేసీఆర్‌కి బండి సంజయ్ సవాల్:యాదాద్రి ఆలయానికి వెళ్లే విషయమై రాని స్పష్టత

మునుగోడు  ఎన్నికల  ప్రచారంలో భాగంగా  మర్రిగూడలో  బండి సంజయ్ ఉన్నారు. మర్రిగూడ నుండి బండి సంజయ్  ఇవాళ ఉదయం ఆయన యాదాద్రి  ఆలయానికి బయలుదేారారు. ఇదిలా ఉంటే  బండి  సంజయ్  యాదాద్రి  ఆలయం  వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు.  పోలీసులు అడ్డుకున్నా కూడ  తాను  యాదాద్రికి వెళ్తానని బండి  సంజయ్  తేల్చి  చెప్పారు.

నలుగురు  టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి  చేశారనే ఆరోపణలను  బీజేపీ తీవ్రంగా ఖండిచింది. ప్రగతి  వేదికగానే  ఈ డ్రామా  సాగిందని బీజేపీ నేతలు ఆరోపించారు.  టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు  గురి చేయలేదని యాదాద్రి ఆలయంలో తాను ప్రమాణం  చేస్తానని  బండి సంజయ్  ప్రకటించారు.  కేసీఆర్ ను కూడ రావాలని కోరారు.

యాదాద్రిలో  ప్రమాణం  చేస్తా:బండి సంజయ్

కేసీఆర్ కు  విసిరిన సవాల్  నేపథ్యంలో తాను యాదాద్రి  ఆలయానికి బయలుదేరుతున్నానని బండి సంజయ్ చెప్పారు.శుక్రవారం నాడు ఉదయం  మర్రిగూడలో  ఆయన మీడియాతో మాట్లాడారు. యాదాద్రి ఆలయానికి  9 గంటలకు  కేసీఆర్ వస్తారని భావించానన్నారు.కానీ  కేసీఆర్ యాదాద్రికి రాలేదన్నారు. యాదాద్రి ఆలయానికి  వెళ్లి  తమ నిజాయితీని నిరూపించుకుంటామని  బండి సంజయ్  తేల్చి చెప్పారు. మునుగోడులో టీఆర్ఎస్ దుకాణం  బంద్  అయిందని ఆయన ఎద్దేవా చేశారు. దీంతో హైద్రాబాద్  కేంద్రంగా  కుట్రలు చేస్తున్నారన్నారు.తనను అడ్డుకొనేందుకు  పోలీసులకు సీఎంఓ  నుండి  పోలీసులకు  ఆదేశాలు  అందాయన్నారు. మునుగోడు ఉప ఎన్నిక  నుండి టీఆర్ఎస్  తప్పుుకోవాలని  కేసీఆర్ కు ఆయన  సలహ  సూచించారు.

యాదాద్రిలో  టీఆర్ఎస్ ర్యాలీ
యాదాద్రిలో టీఆర్ఎస్  నేతలు ర్యాలీ  నిర్వహించారు. బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ యాదాద్రికి రావడాన్ని టీఆర్ఎస్ నేతలు  తప్పుబట్టారు. బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. బండి సంజయ్  గో బ్యాక్  అంటూ  అని నినాదాలు చేశారు. 
 

click me!