బీఆర్ఎస్‌ పేరుతో ప్రజల తీర్పును కోరాలి: కేసీఆర్ ను కోరిన బండి సంజయ్

By narsimha lode  |  First Published Oct 6, 2022, 5:24 PM IST

టీఆర్ఎస్ పేరును మార్చినందున  ప్రజల తీర్పును కోరాలని బీజేపీ తెలంగాణ చీఫ్  బండి  సంజయ్ కేసీఆర్ ను కోరారు. 


హైదరాబాద్: తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ కు ఓటు చేశారని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ చెప్పారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చినందున  అసెంబ్లీని రద్దుచేయాలని  బండి సంజయ్  కేసీఆర్ ను డిమాండ్ చేశారు. 

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  గురువారం నాడు  హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు.  ప్రజలు టీఆర్ఎస్ కు  ఓటుచేసినందున ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండానే  పార్టీ పేరు మార్చారన్నారు. ఈ కారణంగా కేసీఆర్ సర్కార్ కు ఒక్క క్షణంకూడా  పాలించే అర్హత లేదన్నారు.దమ్ముంటే బీఆర్ఎస్ పేరుతో ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన కోరారు..ప్రజలు మీకు అధికారాన్ని అప్పగిస్తారనే  విశ్వాసం, నమ్మకం ఉంటే బీఆర్ఎస్ పై పోటీ  చేయాలని ఆయన సవాల్ విసిరారు.  జాతీయ పార్టీ ఎవరూపెట్టినా తాము  స్వాగతిస్తామన్నారు. భారత రాష్ట్రసమితి అంటే అర్ధం ఏమిటోచెప్పాలని  బండి సంజయ్ కోరారు.నిన్న  టీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశంలో పార్టీ నేతలు ఎవరూ కూడా సంతోషంగా కూర్చోలేదన్నారు. 

Latest Videos

మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పేరుతో ఓటు అడిగే  అర్హత లేదన్నారు బండి సంజయ్.తెలంగాణ అస్తిత్వం కోసం ఏర్పాటు చేసుకున్న పార్టీ అని చెప్పుకున్న కేసీఆర్ ...టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా ఎందుకు మార్చారో చెప్పాలన్నారు. తెలంగాణకు  టూరిస్ట్  గా వచ్చే  నేతలు ఏదో చెబుతుంటారని బీజేపీ పై చేసిన విమర్శలను బండి సంజయ్ ప్రస్తావించారు. టీఆర్ఎస్ ఏర్పాటుచేసిన సమయంలో ఉన్న వాళ్లలో ఇప్పుడు ఆ పార్టీలో ఎందరున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు. 

. తెలంగాణకు కేంద్రం ఏం చేయలేదని పదే పదే  కేసీఆర్ ప్రశ్నించారన్నారు. బీఆర్ఎస్ గా  తెలంగాణకు ఏం చేస్తావో చెప్పాలని బండి సంజయ్ కేసీఆర్ ను కోరారు. దేశంలో వచ్చే ఆదాయం నుండి తెలంగాణకు ఎంత ఖర్చు చేస్తావో చెప్పాలన్నారు.ఏ ఎజెండాతో కేసీఆర్ జాతీయపార్టీని పెట్టారని ఆయన ప్రశ్నించారు. కొడుకును ముఖ్యమంత్రిని చేయాలనేదే కేసీఆర్ ఆలోచన అని  బండి సంజయ్ చెప్పారు. 
 
జాతీయ పార్టీని కేసీఆర్ ప్రకటించే సమవేశానికి ఎంతమంది జాతీయ నేతలు వచ్చారని ఆయన ప్రశ్నించారు.కుమార స్వామి మినహా ఎవరూ కూడా రాలేదని  బండి సంజయ్ గుర్తుచేశారు.  కుమారస్వామికి కర్ణాటకలోనే అతీగతీ లేదన్నారు. అలాంటి జేడీఎస్ పార్టీ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటానని  ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. 

కేఏ పాల్, కేసీఆర్ లు స్వంతంగా విమానాలు కొనుగోలు చేశారన్నారు. వీరిద్దరూ భవిష్యత్తులో పొత్తు పెట్టుకొంటారేమోనని బండి సంజయ్ సెటైర్లు వేశారు.5 ఏళ్లపాటు కేసీఆర్ మంత్రివర్గంలో ఒక్క మహిళ మంత్రి కూడ లేదన్నారు. ఏళ్ల పాటు మహిళా కమిషన్ ఏర్పాటు చేయని కేసీఆర్ మహిళలపై వివక్ష గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. 

also read:బీఆర్ఎస్ ఏర్పాటును స్వాగతిస్తున్నాం: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని

పేదలంటే కేసీఆర్ కు గిట్టదన్నారు. దళితలు, ఎస్టీలు,బీసీలు, అగ్రకులాల్లోని పేదలతో పాటు తన స్వంత సామాజికవర్గాన్ని కూడా కేసీఆర్ మోసం  చేశారని బండి సంజయ్ విమర్శించారు.

click me!