రాజాసింగ్ పై బీజేపీ సస్పెన్షన్ వేటు:శాసనసభ పక్ష నేత పదవి నుండి తొలగింపు

By narsimha lodeFirst Published Aug 23, 2022, 2:56 PM IST
Highlights

గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పార్టీ నుండి సస్పెండ్ చేసింది బీజేపీ. బీజేపీకి చెందిన అన్ని పదవుల నుండి రాజాసింగ్ ను తొలగించింది. పది రోజుల్లో ఈ విషయమై వివరణ ఇవ్వాలని బీజేపీ ఆదేశించింది. 

హైదరాబాద్: గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బిజెపి నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ స్థితిలో తలెత్తిన పరిణామాల నేపథ్యంలో పార్టీ నాయకత్వం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. శాసనసభా పక్ష నేత పదవి నుంచి కూడా ఆయనను పార్టీ నాయకత్వం తప్పించింది.   హైద్రాబాద్ లో   మునావర్ ఫరూఖీ షో  నిర్వహణకు అనుమతి ఇవ్వకూడదని ఆయన డిమాండ్ చేస్తూ వచ్చారు. అయితే, భారీ పోలీసు బందోబస్తు నడుమ ఆయన షో నడిచింది. దీంతో తీవ్రమై ఆగ్రహానికి గురైన రాజాసిందత్ సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేశారు. మహ్మద్ ప్రవక్తపై రాజా సింగ్  అనుచిత వ్వాఖ్యలు చేస్తూ ఆ వీడియోను రూపొందించారని ఎంఐఎం ఆరోపిస్తుంది.ఈ విషయమై చర్యలు తీసకోవాలని కోరుతూ సోమవారం నాడు రాత్రి నుండి మంగళవారం నాడు ఉదయం వరకు హైద్రాబాద్ సీపీ కార్యాలయం ముందు మజ్లీస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దాంతో వీడియోను యూట్యూబ్ నుంచి తొలగింపజేయడమే కాకుండా డబీర్ పురా పోలీసులు కేసు నమోదు చేసి  ఈ రోజు ఉదయం రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 

పార్టీ నుండి ఎందుకు బహిష్కరించకూడదో చెప్పాలని కూడా బీజేపీ నాయకత్వం సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించింది. బీజేపీ కేంద్ర క్రమశిక్షణ సంఘం మెంబర్ సెక్రటరీ పేరుతో  మీడియాకు ప్రెస్ నోట్ ను విడుదల చేసింది. పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నామని ఆ నోట్ పేర్కొంది. అంతేకాదు ఆయనకు ఉన్న బాధ్యతల నుండి కూడా వెంటనే తొలగిస్తున్నామని కూడా ఆ నోట్ తెలిపింది. దీంతో బీజేపీ శాసనసభపక్ష నేత పదవి నుండి కూడా రాజాసింగ్ ను తప్పించినట్టైంది.  బీజేపీ నియామావళికి విరుద్దంగా వ్యవహరించినందుకు గాను ఈ చర్యలు తీసుకొంటున్నట్టుగా ఈ ప్రకటన తెలుపుతుంది. పార్టీ నియామావళికి విరుద్దంగా వ్యవహరించినందున సస్పెండ్ చేస్తున్నట్టుగా ప్రకటించింది. అయితే ఈ విషయమై 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని కూడా రాజాసింగ్ ను బీజేపీ నాయకత్వం ఆదేశించింది.  ఈ ఏడాది సెప్టెంబర్  2 వ తేదీ లోపుగా ఈ విషయమై స్పష్టత ఇవ్వాలని కోరింది. 

also read:ధర్మం కోసం చావడానికైనా సిద్దమే: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

సోషల్ మీడియాలలో రాజాసింగ్ అప్ లోడ్ చేసిన వీడియోలో వివాదాస్పద వ్యాఖ్యలు ఉంండంతో ఎంఐఎం ఆందోళన చేసింది. గతంలోనే సస్పెన్షన్ కు గురైన నుపుర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో దేశ వ్యాప్తంగా ఆందోళనలు చోటు చేసుకొన్నాయి. హింసాత్మక ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ తరుణంలో రాజాసింగ్ పై బీజేపీ నాయకత్వం రాజాసింగ్ పై సస్పెన్షన్ వేటు వేసింది.  రాజాసింగ్ అప్ లోడ్ చేసిన వీడియో విషయమై పోలీసుల వినతి మేరకు యూట్యూబ్ ఈ వీడియోను తొలగించింది. మునావర్ పరూఖీ విషయమై తాను రెండో భాగం  వీడియోను విడుదల చేయనున్నట్టుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ధర్మం కంటే తనకు పార్టీ ముఖ్యం కాదని కూడా రాజాసింగ్ మూడు రోజుల క్రితం ప్రకటించారు. ధర్మాన్ని కాపాడడం కోసం తాను పోరాటం చేస్తున్నట్టుగా రాజాసింగ్ చెప్పారు. ఇవాళ ఉదయం భారీగా రాజాసింగ్ ఇంటి వద్ద పోలీసులను మోహరించారు. ఆ తర్వాత ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజాసింగ్ ను బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

click me!