అసెంబ్లీ బరిలో బీజేపీ సీనియర్లు.. కరీంనగర్ నుంచి బండి, కోరుట్ల నుంచి అర్వింద్ !

By Asianet News  |  First Published Oct 9, 2023, 9:54 AM IST

తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకులంతా ఈ సారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవనున్నారు. కరీంగనర్ నుంచి బండి సంజయ్, కోరుట్ల నుంచి ధర్మపురి అర్వింద్, మెదక్ నుంచి విజయశాంతి, అంబర్ పేట నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పోటీ చేయనున్నారని తెలుస్తోంది.


తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో అన్ని పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అధికార బీఆర్ఎస్ ఇప్పటికే దాదాపు తమ అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్, బీజేపీ ఈ వారం తరువాత, లేదా ఆలోపే తమ అభ్యర్థులను అధికారికంగా ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ ఈ నెల 15వ తేదీన, బీజేపీ ఈ నెల 16వ తేదీన అభ్యర్థుల లిస్టును విడుదల చేసే అవకాశం ఉందని ఆయా పార్టీ వర్గాలు తెలిపాయి.

తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల నేడే

Latest Videos

అయితే ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ రంగంలోకి దిగుతోంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. దాదాపు 50 స్థానాల్లో అభ్యర్థులు ఖరారు అయినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా.. ఈ సారి బీజేపీ సీనియర్లు అంతా అసెంబ్లీ బరిలో నిలవాలని పార్టీ హైకమాండ్ స్పష్టం చేసింది. దీంతో ప్రస్తుతం ఎంపీలుగా ఉన్న బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ధర్మపురి అర్వింద్, సోయం బాపురావు, రాజ్యసభ సభ్యుడు కే.లక్ష్మణ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారని తెలుస్తోంది.

ప్రస్తుతం లక్ష్మణ్ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అందుకే ఆయన స్థానంలో బీజేపీ సీనియర్ నాయకుడు, 
ఆయన స్థానంలో ఆ పార్టీ సీనియర్ నాయకుడు, ప్రస్తుత హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మికి అవకాశం ఇవ్వాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. అయితే అదే స్థానం నంచి ప్రదీప్ కుమార్ కూడా పోటీ చేయాలని అనుకుంటున్నారు. ఆదిలాబాద్ ఎంపీగా ఉన్న సోయం బాపురావు స్థానంలో ఆయన కుమారుడు సోయం వెంకటేశ్వర్లు పోటీ చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది.

దారుణం.. ఏడేళ్ల బాలికపై లైంగికవేధింపులు.. అడ్డుచెప్పిందని.. ఊపిరాడకుండా చేసి..

కాగా.. బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో కూడా ఆయన పలుమార్లు అక్కడి నుంచి పోటీ చేశారు. అలాగే ఆ పార్టీ సీనియర్ నాయకురాలు, నటి విజయశాంతిని మెదక్‌ అసెంబ్లీ బరిలో నిలపాలని పార్టీ హైకమాండ్ భావిస్తోంది. నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అర్వింద్ కోరుట్ల నుంచి బరిలోకి దిగాలని చూస్తున్నారు. ఆర్మూర్ నుంచి కూడా పోటీ చేసే అవకాశాలు పరిశీలిస్తున్నారు. ఈ రెండు స్థానాలు జగిత్యాల జిల్లా పరిధిలో ఉన్నాయి.

ఢిల్లీ ఎయిమ్స్‌లో టిబెటన్ మత గురువు దలైలామా !?

గతంలో మాదిరిగానే అంబర్‌పేట నుంచి జి. కిషన్‌రెడ్డి పోటీ చేయాలని భావిస్తున్నారు. అలాగే మాజీ ఎంపీ వివేక్ బెల్లంపల్లి నుంచి, హుజూరాబాద్ నుంచి ఈటల రాజేందర్, దుబ్బాక నుంచి రఘునందన్ రావు, ఆందోల్ నుంచి బాబూ మోహన్, మహబూబ్‌నగర్‌ నుంచి జితేందర్‌రెడ్డి, గద్వాల నుంచి డీకేఅరుణ, మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పోటీ చేయనున్నారు.

click me!