ఎందుకు ఓడాం: తెలంగాణ ఎన్నికల ఫలితాలపై బీజేపీ సమీక్ష

By narsimha lodeFirst Published Dec 24, 2018, 6:06 PM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై  బీజేపీ సమీక్ష నిర్వహిస్తోంది.


హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై  బీజేపీ సమీక్ష నిర్వహిస్తోంది. తెలంగాణ బీజేపీ ఇంచార్జీ, కేంద్ర మంత్రి జేపీ నడ్డా అధ్యక్షతన  ఈ సమీక్ష సమావేశం హైద్రాబాద్ పార్టీ కార్యాలయంలో సోమవారం నాడు జరిగింది.

ఈ ఎన్నికల్లో  బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో బీజేపీ ఒక్క స్థానంలోనే విజయం సాధించింది. గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం మినహా మిగిలిన స్థానాల్లో  ఆ పార్టీ ఓటమి పాలైంది.

ఈ ఎన్నికల్లో తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకొనే దిశగా బీజేపీ పావులు కదిపింది. ఎన్నికలకు ముందు కొందరు కీలకమైన కాంగ్రెస్ పార్టీ నేతలతో చర్చలు కూడ బీజేపీ నేతలు చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు ఎవరూ కూడ బీజేపీలో చేరలేదు.

ఈ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిపోరు చేసింది. కానీ, గోషామహల్ స్థానంలో రాజాసింగ్ మాత్రమే విజయం సాధించారు.తెలంగాణ ఎన్నికల ఫలితాలపై బీజేపీ సమీక్ష నిర్వహిస్తోంది.

జిల్లాలు, నియోజకవర్గాల వారీగా వచ్చిన ఓట్ల శాతం, ఓట్లు, గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లపై  ఆ పార్టీ నేతలు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఏ కారణం చేత ఈ ఎన్నికల్లో బీజేపీ ఘోర వైఫల్యాన్ని చవిచూడాల్సి వచ్చిందనే విషయాన్ని చర్చిస్తున్నారు.

బీజేపీ పార్లమెంటరీ పార్టీకి  తెలంగాణలో రాష్ట్రంలో ఓటమిపై నివేదికను కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఇవ్వనున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో  అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమీక్ష ఆధారంగా  బీజేపీ ప్లాన్ చేయనుంది.

2014 ఎన్నికల్లో ఐదు స్థానాలు, ఒక్క పార్లమెంట్ స్థానంలో బీజేపీ గెలుపొందింది. ఆ సమయంలో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి.సుమారు నలభైకి పైగా స్థానాల్లో  ఆ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసి కేవలం 5 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో టీడీపీ 15 అసెంబ్లీ, 1 ఎంపీ స్థానాన్ని గెలుచుకొన్న విషయం తెలిసిందే.


 

click me!