అక్టోబర్ మెుదటి వారంలో ఫస్ట్ లిస్ట్ విడుదల: లక్ష్మణ్

Published : Sep 26, 2018, 08:28 PM IST
అక్టోబర్ మెుదటి వారంలో ఫస్ట్ లిస్ట్ విడుదల: లక్ష్మణ్

సారాంశం

అక్టోబర్ మెుదటి వారంలో 30 మంది అభ్యర్థులతో తొలిజాబితాప్రకటిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రకటించారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతుందని తెలిపారు. తమ పార్టీలో చేరేందుకు టీజేఎస్, తెలంగాణ ఇంటి పార్టీ నేతలు ఊగిసలాడుతున్నారని తెలిపారు. 

హైదరాబాద్‌ : అక్టోబర్ మెుదటి వారంలో 30 మంది అభ్యర్థులతో తొలిజాబితాప్రకటిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రకటించారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతుందని తెలిపారు. తమ పార్టీలో చేరేందుకు టీజేఎస్, తెలంగాణ ఇంటి పార్టీ నేతలు ఊగిసలాడుతున్నారని తెలిపారు. తెలంగాణ ఇంటిపార్టీ నేత యెన్నం శ్రీనివాస్ తో సహా పార్టీలోకి ఎవరు వచ్చిన షరతులు లేని చేరికలు ఉంటాయన్నారు. 

అక్టోబర్ నెలలో కరీంనగర్, వరంగల్ జిల్లాలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా యువ సమ్మేళనాలు కూడా నిర్వహించబోతున్నట్లు తెలిపారు. 

మరోవైపు టీడీపీ నేత, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యకు బీజేపీ స్వాగతం పలుకుతుందని తెలిపారు. ఆర్ కృష్ణయ్య పార్టీకి వస్తామంటే ఎంపీ టిక్కెట్ ఇవ్వడానికి అయినా సరై సిద్దమేనని ప్రకటించారు.  

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్