పంతం నెగ్గించుకున్న జేపీ నడ్డా.. సికింద్రాబాద్‌లో గాంధీ విగ్రహానికి నివాళి, ర్యాలీ లేకుండా నిరసనతో సరి

Siva Kodati |  
Published : Jan 04, 2022, 07:05 PM ISTUpdated : Jan 04, 2022, 07:13 PM IST
పంతం నెగ్గించుకున్న జేపీ నడ్డా.. సికింద్రాబాద్‌లో గాంధీ విగ్రహానికి నివాళి, ర్యాలీ లేకుండా నిరసనతో సరి

సారాంశం

బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పంతం నెగ్గించుకున్నారు. పోలీసుల ఆంక్షల నడుమే ఆయన శంషాబాద్ నుంచి సికింద్రాబాద్ చేరుకున్నారు. అనంతరం జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. నడ్డా వెంట కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తరుణ్ చుగ్ వున్నారు. 

బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పంతం నెగ్గించుకున్నారు. పోలీసుల ఆంక్షల నడుమే ఆయన శంషాబాద్ నుంచి సికింద్రాబాద్ చేరుకున్నారు. అనంతరం జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. నడ్డా వెంట కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తరుణ్ చుగ్ వున్నారు. ఈ సందర్భంగా నల్ల కండువాలు, మాస్క్‌లతో జేపీ నడ్డా నిరసన నిర్వహించారు. ఆయన రాక విషయం తెలుసుకున్న బీజేపీ శ్రేణులు భారీగా సికింద్రాబాద్‌కు తరలివచ్చారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకోకుండా పోలీసులు సైతం భారీగా మోహరించారు. నిరసన ముగిసిన అనంతరం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో జేపీ నడ్డా మీడియాతో మాట్లాడనున్నారు. 

అంతకుముందు శంషాబాద్ విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాము ర్యాలీ సందర్భంగా కరోనా నిబంధనలు పాటిస్తామన్నారు . తన ప్రజాస్వామ్య హక్కును ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. కరోనా నిబంధనలతోనే గాంధీ విగ్రహం వద్దకు వెళ్తామని నడ్డా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగానే గాంధీ విగ్రహానికి నివాళులర్పిస్తానని జేపీ నడ్డా  అన్నారు. తనను జాయింట్ సీపీ కార్తికేయ కలిశారని.. రాష్ట్రంలో కరోనా నిబంధనలు అమల్లో వున్నాయని చెప్పారని ఆయన వెల్లడించారు. అనంతరం జేపీ నడ్డాకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. 

మరోవైపు ప్రజల ఆరోగ్యం, ఒమిక్రాన్ (omicron) కేసుల వ్యాప్తిని నిరోధించేందుకే జేపీ నడ్డా (jp nadda) ర్యాలీకి అనుమతి నిరాకరించినట్లు హైదరాబాద్ పోలీసులు (hyderabad police) స్పష్టం చేశారు. ఈ మేరకు నగర పోలీసులు ఓ ప్రకటనలో వివరాలు తెలియజేశారు. 

ALso Read:జేపీ నడ్డాకు పోలీసుల నోటీసులు.. నా హక్కుల్ని అడ్డుకోలేరు, సికింద్రాబాద్ వెళ్లి తీరతానన్న బీజేపీ చీఫ్

ఇటీవల బండి సంజయ్ (bandi sanjay) అరెస్ట్ తో  రాష్ట్రంలో ఉద్రిక్తతల నేపథ్యంలో జేపీ నడ్డా తెలంగాణ రాష్ట్ర పర్యటనకు ప్రాముఖ్యత చోటు చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పార్టీ నిరసనలు తలపెడుతూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ చేపట్టాలని నిర్ణయించింది.  ఈ ర్యాలీకి బీజేపీ రాష్ట్ర నాయకులు పోలీసులను అనుమతి కోరగా హైదరాబాద్ పోలీసులు నిరాకరించారు. ఈ విషయమై నార్త్ జోన్ డీసీపీ చందనా దీప్తి, జేపీ నడ్డా ర్యాలీ అనుమతి నిరాకరించిన విషయం మీడియాకు తెలియజేశారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

రేవంత్ రెడ్డి సమక్షంలో ఉగాది పంచాంగం | Ugadi Panchangam 2026 | Asianet News Telugu
Neem Trees: ఉగాది పూట వేప పువ్వు దొర‌క‌ని పరిస్థితి.. ఇంత‌కి వేప చెట్లు ఎందుకు ఎండి పోతున్నాయి.?