బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు: రాజకీయ తీర్మానం ప్రవేశ పెట్టిన అమిత్ షా

Published : Jul 03, 2022, 11:36 AM ISTUpdated : Jul 03, 2022, 11:37 AM IST
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు: రాజకీయ తీర్మానం ప్రవేశ పెట్టిన అమిత్ షా

సారాంశం

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఆదివారం నాడు హైద్రాబాద్ లో ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజకీయ తీర్మాణం ప్రవేశ పెట్టారు. ఈ తీర్మానంపై మధ్యాహ్నం వరకు చర్చ జరగనుంది.  ఈ తీర్మానంపై మధ్యాహ్నం తర్వాత అమిత్ షా, జేపీ నడ్డా, మోడీలు ప్రసంగిస్తారు.

హైదరాబాద్: రెండో రోజున BJP జాతీయ కార్యవర్గ సమావేశాలు ఆదివారం నాడు ఉదయం ప్రారంభమయ్యాయి. శనివారం నాడు సాయంత్రం బీజేపీ National Executive meeting ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు JP Nadda ప్రారంభించారు.

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల నుండి 350 మంది ప్రతినిధులు  జాతీయ కార్యవర్గసమావేశాల్లో పాల్గొన్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఇవాళ రాజకీయ తీర్మానంపై  చర్చించనున్నారు. 

భాగ్యనగర డిక్లరేషన్ పేరుతో  రాజకీయ తీర్మాణం చేయనున్నారు. ఈ రాజకీయ తీర్మాణంలో బీజేపీ ఏం చెప్పనుందనేది ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది.  మరో వైపు తెలంగాణపై కూడా బీజేపీ జాతీయ నాయకత్వం కీలక తీర్మానం చేసే అవకాశం ఉంది. 

దేశంలో పార్టీ పరిస్థితిపై  రాజకీయ తీర్మాణంపై చర్చించనున్నారు. ఏ రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంది, ఎక్కడ  పార్టీని విస్తరించాల్సి ఉంది, ఏ ప్రాంతంలో ఏ రకమైన వ్యూహాంతో ముందుకు వెళ్లాలనే దానిపై బీజేపీ అగ్ర నాయకత్వం ఈ తీర్మాణంపై చర్చించనుంది.  మధ్యాహ్నం తర్వాత  బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో జేపీ నడ్డా, Amit Shahషాలు ప్రసంగించనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగంతో జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగియనున్నాయి.

also read:మోడీని అవమానిస్తే ఊరుకోం: కేసీఆర్‌ సేల్స్ మెన్ వ్యాఖ్యలపై బండి సంజయ్ కౌంటర్

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాజకీయ తీర్మాణాన్ని ప్రవేశ పెట్టారు. దేశంలో అధికారంలో లేని రాష్ట్రాల్లో ఏ రకమైన  వ్యూహాంతో ముందుకు వెళ్లాలనే దానిపై బీజేపీ నాయకత్వం చర్చించనున్నారు. తెలంగాణ, కేరళ, బెంగాల్ తదితర రాష్ట్రాల్లో   ఏ రకమైన వ్యూహాంతో ముందుకు వెళ్లాలనే దానిపై  బీజేపీ నాయకత్వం చర్చించనుంది. 

Telangana రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పార్టీ అగ్ర నేతలు పర్యటించారు పార్టీ నేతల ఇళ్లలో బస చేశారు.ఆయా నియోజకవర్గాల్లో బీజేపీని బలోపేతం చేసేందుకు పార్టీ అగ్రనేతలు దిశా నిర్ధేశం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ విధానాన్ని దేశంలో  అధికారంలో లేని రాష్ట్రాల్లో కూడా బీజేపీ నేతలు అమలు చేయనున్నారు. 

Gujarat రాష్ట్రంలో ఒక్క జిల్లాల్లో 48 గంటల పాటు  బీజేపీ నేతలు పర్యటించనున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిని బట్టి దిశా నిర్ధేశ చేయనున్నారు.  గుజారాత్ మోడల్ నుండే తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో  బీజేపీ అగ్రనేతలు పర్యటించారు. ఆర్ధిక తీర్మాణంలో కూడా తెలంగాణ రాష్ట్రం నుండి మాట్లాడిన పొంగులేటి సుధాకర్ రెడ్డి, వివేక్ లు రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాలను ప్రస్తావించారు. తమ రాష్ట్రంలో కూడా ఇదే తరహాలో జరుగుతుందని పశ్చిమ బెంగాల్ నేతలు గుర్తు చేశారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే