నన్ను చంపేందుకు కుట్ర జరుగుతోంది: ఎంపీ సోయం బాపూరావు వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Sep 26, 2019, 08:45 PM ISTUpdated : Sep 26, 2019, 09:09 PM IST
నన్ను చంపేందుకు కుట్ర జరుగుతోంది: ఎంపీ సోయం బాపూరావు వ్యాఖ్యలు

సారాంశం

బీజేపీ నేత, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని.. ఆదివాసీలు ఐకమత్యంగా ఉంటే ఏ శక్తులు ఏం చేయలేవన్నారు

బీజేపీ నేత, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని.. ఆదివాసీలు ఐకమత్యంగా ఉంటే ఏ శక్తులు ఏం చేయలేవన్నారు.

ఆదివాసీ ఉద్యమాన్ని లేకుండా చేయాలని కుట్ర జరుగుతోందని, ఎవరెన్ని కుట్రలు పన్నినా తమ ఉద్యమాన్ని ఆపలేరని బాబూరావు స్పష్టం చేశారు. ఆదివాసి జాతి కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని ఆయన ప్రకటించారు.

లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చి ఆదివాసీలకు ప్రభుత్వం అన్యాయం చేసిందని మండిపడ్డారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సోయం బాపూరావు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఆదిలాబాద్ టికెట్ ఆశించారు.

అయితే కాంగ్రెస్ అధిష్టానం రమేశ్ రాథోడ్‌కి టికెట్ కేటాయించడంతో ఆయన బీజేపీలో చేరి టీఆర్ఎస్ అభ్యర్ధి నగేశ్‌పై విజయం సాధించిన సంగతి తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!