అవసరం లేకపోయినా మందుల కొనుగోళ్లు: టీఎస్ ఈఎస్ఐలో రూ.300 కోట్ల స్కాం

By Siva Kodati  |  First Published Sep 26, 2019, 6:23 PM IST

తెలంగాణ ఈఎస్ఐ‌లో భారీ స్కాం వెలుగుచూసింది. ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణి మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ అధికారుల దర్యాప్తులో తేలింది


తెలంగాణ ఈఎస్ఐ‌లో భారీ స్కాం వెలుగుచూసింది. ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణి మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ అధికారుల దర్యాప్తులో తేలింది.

అవసరం లేకపోయినప్పటికీ రూ.300 కోట్ల విలువైన మందులను కొనుగోలు చేయడంతో పాటు.. రూ. 10 వేల మందులకు గాను లక్ష రూపాయలను క్లైయిమ్ చేసినట్లుగా నిర్థారించారు.  

Latest Videos

అర్హత లేని ఏజెన్సీల నుంచి మందులను కొనుగోలు చేసేందుకు గాను బినామీల పేర్లను వాడుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారంలో దేవికారాణితో పాటు మరో 23 మంది ఇళ్లపై ఏసీబీ దాడులు నిర్వహించింది. 

click me!