సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు

Published : Jun 05, 2019, 07:18 PM IST
సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు

సారాంశం

నారాయణపేట జిల్లా దేవరకద్ర గ్రామంలో బీజేపీ కార్యకర్త ముష్టి ప్రేమ్ కుమార్ హత్యలో టీఆర్ఎస్ అగ్రనాయకుల ప్రమేయం ఉందని ఆరోపించారు. ప్రేమ్ కుమార్ తో పాటు మరో ముగ్గురిని సామూహికంగా హత్య చేసేందుకు టీఆర్ఎస్ అగ్రనాయకత్వం కుట్రపన్నిందని ఆరోపించారు. 

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్. కేసీఆర్‌ హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు.  రాష్ట్రంలో బీజేపీ ప్రత్నామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడంతో ఆందోళనకు గురవుతున్న కేసీఆర్ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. 

నారాయణపేట జిల్లా దేవరకద్ర గ్రామంలో బీజేపీ కార్యకర్త ముష్టి ప్రేమ్ కుమార్ హత్యలో టీఆర్ఎస్ అగ్రనాయకుల ప్రమేయం ఉందని ఆరోపించారు. ప్రేమ్ కుమార్ తో పాటు మరో ముగ్గురిని సామూహికంగా హత్య చేసేందుకు టీఆర్ఎస్ అగ్రనాయకత్వం కుట్రపన్నిందని ఆరోపించారు. 

పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, కేరళ సీఎం పినరాయి విజయన్‌ల మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ నాయకత్వం హత్యా రాజకీయాలకు తెరలేపిందన్నారు. 

రాబోయే రోజుల్లో దాడులు హత్యా రాజకీయాలు మితి మీరు పోయే ప్రమాదం ఉందని వాటిని ధీటుగా ఎదుర్కునేందుకు బీజేపీ నాయకత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రేమ్ కుమార్ హత్యపై సమగ్ర దర్యాప్తు జరిపి హంతకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. 

దాడులు, హత్య రాజకీయాలకు పాల్పడితే ఎలాంటి గతి పడుతుందో మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ కు తెలిసిందని భవిష్యత్ లో కేసీఆర్ కు అలాంటి గతే పడుతుందని హఎచ్చరించారు. 

తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యకర్తలు నాయకులు మనోధైర్యంతో ప్రజాక్షేత్రంలో ముందుకు సాగాలని, టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు చేసేందుకు వెనుకాడొద్దని ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. 

PREV
click me!

Recommended Stories

KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu
KCR Press Meet: ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క: కేసీఆర్| Asianet News Telugu