విద్యుత్ కొనుగోలులో కేసీఆర్ సర్కార్ కుంభకోణాలు: బీజేపీ ఎంపీ అరవింద్

By narsimha lodeFirst Published Dec 6, 2022, 3:39 PM IST
Highlights

కేసీఆర్  తప్పుడు వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. కేసీఆర్ సర్కార్  వైఫల్యాలపై బీజేపీ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు.

న్యూఢిల్లీ:విద్యుత్ కొనుగోలులో  కేసీఆర్ ప్రభుత్వం భారీ స్కామ్ కి పాల్పడుతుందని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్  చెప్పారు.మంగళవారంనాడు న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యుత్  కొనుగోలులో చేసిన స్కాంలో వచ్చిన డబ్బులనే లిక్కర్ స్కాం, ఫీనిక్స్ లో  పెట్టుబడులు పెడుతున్నారని  ధర్మపురి అరవింద్ ఆరోపించారు.తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ కమిటీ వేసిందన్నారు. ఈ కమిటీలో తనతో పాటు వివేక్,ప్రకాష్ రెడ్డి ఆజ్మీరా బాబీ సభ్యులుగా  ఉన్నారని  అరవింద్  చెప్పారు.టీఆర్ఎస్ పై చార్జీషీట్  దాఖలు చేయడానికి ఈ  కమిటీ నివేదికే కీలకంగా ఉంటుందన్నారు.ప్రజాధనం దోచుకోవడం తప్ప టీఆర్ఎస్ కు దేనిపైనా చిత్తశుద్ది లేదన్నారు.రైతులను కూలీలుగా మార్చిన ఘనత కేసీఆర్ దేనని అరవింద్  చెప్పారు. 
కేసీఆర్ తప్పుడు వాగ్దానాలకు రైతులు బలౌతున్నారని ఆయన విమర్శించారు. వ్యవసాయ లబ్దిదారుల జాబితాను కేసీఆర్ బయటపెట్టడం లేదని చెప్పారు.

ఏ దర్యాప్తు సంస్థ అయినా కూడా తాము సహకరిస్తామని చెప్పిన టీఆర్ఎస్ నేతలు  సీబీఐ దర్యాప్తును ఎందుకు వాయిదా వేస్తున్నారని  ఆయన  కవితను ప్రశ్నించారు. తొలుత ఇవాళ విచారణకు సహకరిస్తామని కవిత  సీబీఐకి లేఖ రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  కానీ ఆ తర్వాత  మాత్రం మరో నాలుగు తేదీలను  ఇచ్చి విచారణకు రావాలని కోరిన విషయాన్ని ఎంపీ ధర్మపురి అరవింద్ గుర్తు చేశారు. 
 

click me!