అంతర్జాతీయ వ్యభిచార రాకెట్ ముఠా గుట్టు రట్టు:17 మందిని అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు

By narsimha lode  |  First Published Dec 6, 2022, 1:19 PM IST

అంతర్జాతీయ వ్యభిచార రాకెట్ ముఠాను  సైబరాబాద్ పోలీసులు మంగళవారంనాడు అరెస్ట్  చేశారు.  39 కేసుల్లో  17 మందిని పోలీసులు అరెస్ట్  చేశారు.  14,190 మంది బాధితులకు  విముక్తి కల్పించారు.


హైదరాబాద్: అంతర్జాతీయ వ్యభిచార రాకెట్  ముఠా గుట్టు రట్టు చేసింది సైబరాబాద్  పోలీసులు. 14,190 మందికి విముక్తి కల్పించారు.  39 కేసుల్లో  17 మందిని  అరెస్ట్  చేశామని సైబారాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. 

మంగళవారంనాడు తన కార్యాలయంలో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాతో మాట్లాడారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ, ముంబైతో పాటు బంగ్లాదేశ్, థాయ్ లాండ్, రష్యాలకు చెందిన బాధితులకు పోలీసులు విముక్తి  కల్పించారు.  పలు వెబ్ సైట్లలో ఎస్కార్ట్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టుగా  తమ దర్యాప్తులో తేలిందన్నారు. ఉపాధి పేరుతో వ్యభిచారం చేయిస్తున్నారని సీపీ చెప్పారు.

Latest Videos

అనంతపురం జిల్లా నుండి కొందరు బాధితులను ఈ రొంపిలోకి దింపుతున్నారని తాము గుర్తించామన్నారు. రాచకొండ, సైబరాబాద్, హైద్రాబాద్ కమిషనరేట్ల పరిధిల్లో  వ్యభిచారంలోకి దింపుతున్నవారిని  గుర్తించామన్నారు.

 


 

click me!