బీజేపీ నేత ధర్మపురి అరవింద్ ‘వ్యక్తిగత దాడి’ని ‘అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్’ అంటూ బీఆర్‌ఎస్ నేత, కేసీఆర్ కుమార్తె కవిత మండిపడ్డారు.
నిజామాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, ఆయన కుమారుడు కెటిఆర్ చనిపోతే ఆ పార్టీ నగదు బహుమతి ఇస్తుందని బిజెపి నేత, నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు అరవింద్ ధర్మపురి మంగళవారం వివాదానికి తెర లేపారు.
మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ, రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ ప్రకటించిన మేనిఫెస్టోను ప్రస్తావిస్తూ, భారత రాష్ట్ర సమితి అధినేత కె చంద్రశేఖర్ రావుపై మండిపడ్డారు.
కేసీఆర్ తాగుడు... కేటీఆర్ పీల్చుడు... కవిత దోచుడు..: ఎంపీ అరవింద్ సెటైర్లు
బీఆర్‌ఎస్ తన మ్యానిఫెస్టోలో కేసీఆర్ బీమా పథకం కింద చనిపోయిన రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా హామీ ఇచ్చిందని పేర్కొన్నారు. అయితే, మరణించిన రైతు 56 ఏళ్లలోపు వయసు ఉండాలని...అప్పుడే ఆ కుటుంబాలకు బీమా ఇస్తామని బీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో పేర్కొన్నారని బీజేపీ నేత అరవింద్ ఆరోపించారు.
బీఆర్‌ఎస్ మేనిఫెస్టోపై ధర్మపురి అరవింద్ మండిపడుతూ.. కేసీఆర్ చనిపోతే బీజేపీ రూ.5 లక్షలు ఇస్తుందని, కేటీఆర్ (కేసీఆర్ కొడుకు) చనిపోతే ఆ మొత్తాన్ని రూ.10 లక్షలకు పెంచుతామని చెప్పుకొచ్చారు. ఇంకా మాట్లాడుతూ.. "కేసీఆర్ కు సమయం దగ్గర పడ్డది. చిన్నవారు చనిపోతే ఎక్కువ విలువ, ఎక్కువ డబ్బు ఆయన మాట ప్రకారమే.. కవిత చనిపోతే, నేను రూ. 20 లక్షలు ప్రకటిస్తాను" అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ నేత వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ నాయకురాలు, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత స్పందిస్తూ.. అరవింద్ ధర్మపురి నాపై చేసిన వ్యాఖ్యలు మీ కూతుళ్లపై చేస్తే మీరు మౌనంగా ఉంటారా..? అని ప్రశ్నించారు. నేను రాజకీయాల్లో ఉన్నాననే మీరిలా మాట్లాడుతున్నారు? కేసీఆర్ కూతురి మీదే ఇలా మాట్లాడతారా? ఇదేనా రాజకీయం? అంటూ ఘాటుగా స్పందించారు.
కవిత అరవింద్ వ్యాఖ్యల మీద విరుచుకుపడుతూ... “నువ్వు చనిపోతే రూ.20 లక్షలు, నీ అన్న చనిపోతే రూ.10 లక్షలు, నీ తండ్రి చనిపోతే రూ.5 లక్షలు.. అంటూ ఇలా ఇంకా ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు.. దీనికి భాష, వాడిన పదాల ఎంపిక, వ్యక్తిగత దాడులు, ఇది ఎంత వరకు సరైనదో ప్రజలు ఆలోచించాలి’’ అని ఆమె అన్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వాడిన ‘అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్’ పై ‘ఆలోచించాలని’ రాష్ట్ర ప్రజలను కవిత కోరారు.