రెండో రోజూ ఈడీ విచారణకు ఎమ్మెల్యే మంచిరెడ్డి: బ్యాంకు స్టేట్‌మెంట్‌తో హాజరు

By narsimha lode  |  First Published Sep 28, 2022, 10:39 AM IST

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి  రెండో రోజూ ఈడీ విచారణకు ఇవాళ  హాజరయ్యారు. తన బ్యాంకు ఖాతాల వివరాలను తీసుకొని ఎమ్మెల్యే విచారణకు హాజరయ్యారు.


హైదరాబాద్: టీఆర్ఎస్ కు చెందిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి బుధవారం నాడు ఈడీ అధికారుల విచారణకు హాజరయ్యారు. నిన్న కూడా ఈడీ అధికారులు మంచిరెడ్డి కిషన్ రెడ్డిని విచారించారు. నిన్న సుమారు తొమ్మిది గంటల పాటు మంచిరెడ్డి కిషన్  రెడ్డిని ఈడీ అధికారులు విచారించారు. నిన్న జరిగిన విచారణకు కొనసాగింపుగానే ఇవాళ కూడా ఈడీ అధికారులు ఇవాళ విచారణ చేస్తున్నారు. తన బ్యాంకు ఖాతాలకు చెందిన స్టేట్ మెంట్లను తీసుకొని ఈడీ అధికారులు విచారణకు హాజరయ్యారు

నిన్న జరిగిన విచారణకు కొనసాగింపుగానే ఇవాళ కూడా ఈడీ అధికారులు ఇవాళ విచారణ చేస్తున్నారు. తన బ్యాంకు ఖాతాలకు చెందిన స్టేట్ మెంట్లను తీసుకొని ఈడీ అధికారులు విచారణకు హాజరయ్యారు.  తక్కువ సమయంలోనే రూ. 88 కోట్ల లావాదేవీలను మంచిరెడ్డి కిషన్ రెడ్డి చేశారని ఈడీ అధికారులు గుర్తించారు.ఈ విషయమై మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. గతంలోనే ఈ విషయమై ఈడీ అధికారులు మంచిరెడ్డి కిషన్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు.ఈ నోటీసులపై ఈడీ అధికారులకు మంచిరెడ్డి కిషన్ రెడ్డి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఇదే విషయమై ఈడీ అధికారులు మంచిరెడ్డి కిషన్ రెడ్డిని  విచారిస్తున్నారు.

Latest Videos

undefined

2014 లో మంచిరెడ్డి కిషన్ రెడ్డి విదేశాలకు వెళ్లాడు. అమెరికాలోని తన బంధువు ద్వారా మంచిరెడ్డి కిషన్ రెడ్డి సుమారు రూ. 2 వేల యూఎస్ డాలర్లను తన ఖాతాలోకి ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారు. . విదేశాల్లో గోల్డ్ మైన్లలో మంచిరెడ్డి కిషన్ రెడ్డి పెట్టుబడులు పెట్టారని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ విషయమై ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని  ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై ఆరోపణలున్నాయి.ఈ విషయమై ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.

also read:ముగిసిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఈడీ విచారణ... 8 గంటల పాటు ప్రశ్నల వర్షం

2009లో ఇబ్రహీంపట్నం అసెంబ్లీ స్థానం నుండి మంచిరెడ్డి కిషన్ రెడ్డి తొలిసారిగా అసెంబ్లీకి అడుగు పెట్టాడు. టీడీపీ ఎమ్మెల్యేగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. 2014లో కూడా ఇదే స్థానం నుండి ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన కొన్ని రోజుల్లో ఆయన టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరారు. 2018 లో  ఇబ్రహీంపట్నం నుండి ఆయన టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. 

click me!