మంత్రి నిరంజన్ రెడ్డిపై ఈడీకి ఫిర్యాదు చేస్తా.. చైనాకు చెందిన వ్యక్తితో సంబంధం ఏమిటి?: రఘునందన్ రావు

Published : Apr 24, 2023, 01:40 PM IST
మంత్రి నిరంజన్ రెడ్డిపై ఈడీకి ఫిర్యాదు చేస్తా.. చైనాకు చెందిన వ్యక్తితో సంబంధం ఏమిటి?: రఘునందన్ రావు

సారాంశం

హైదరాబాద్‌: తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు ఫిర్యాదు చేయనున్నట్టుగా బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్ రావు తెలిపారు. 

హైదరాబాద్‌: తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు ఫిర్యాదు చేయనున్నట్టుగా బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్ రావు తెలిపారు. మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన రఘునందన్ రావు.. సర్వే నెం. 65 మినహా మంత్రి ఏ ఒక్క అంశంపై సమాధానం ఇవ్వలేదని అన్నారు. తప్పుడు వాదనలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తాను అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పలేదన్నారు. 

మంత్రి పొలం, ఇల్లు రూ. 4 కోట్లకే అమ్ముతానంటే కొంటానని చెప్పారు. మంత్రి భూమి వరకు 3 కి.మీ సీసీ రోడ్డు వేశారు. 3 కి.మీ సీసీ రోడ్డును రైతులతో కలిసి వేయించుకున్నట్టుగా నిరంజన్ రెడ్డి చెప్పారని.. రూ. 5 కోట్లు ఖర్చు అయ్యే సీసీ రోడ్డును రైతులు చందాలు వేసుకుని నిర్మించుకున్నారా? అని ప్రశ్నించారు. మంత్రి నిరంజన్ రెడ్డి గతంలో ఓ గిరిజన బిడ్డను తన దత్తపుత్రుడిగా చెప్పుకునట్టుగా వార్తలు వచ్చాయని అన్నారు. కాంట్రాక్టులన్నీ దత్తపుత్రుడికి అప్పగిస్తున్నారని ఆరోపించారు. నిరంజ్ రెడ్డి దత్తపుత్రుడు గౌడ నాయక్‌పై ఈడీకి ఫిర్యాదు  చేస్తానని చెప్పారు. 

మంత్రి  నిరంజన్ రెడ్డి పాత నెంబర్ నుంచి రెగ్యులర్ గా చైనాకు కాల్స్ వెళ్లాయని అన్నారు. చైనా వాసి మోతో మంత్రి నిరంజన్ రెడ్డికి ఉన్న సంబంధం ఏమిటని ప్రశ్నించారు. మంత్రి నిరంజన్ రెడ్డి ఫోన్ నెంబర్ ఎందుకు మార్చారని ప్రశ్నించారు. మో అనే వ్యక్తితో మంత్రి నిరంజన్ రెడ్డి లావాదేవీలు జరుపుతున్నారని.. దీనిపై ఈడీ విచారణ కోరతానని చెప్పారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
హైద‌రాబాద్ స‌మీపంలోని ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.. పెట్టుబ‌డి పెట్టే వారికి బెస్ట్ చాయిస్‌